గీతాంజలి కేసులో టీడీపీ కార్యకర్త రాంబాబును అరెస్టు చేసిన పోలీసులు

Geethanjali: రాంబాబుని తెనాలి పోలీసులు ఇవాళ తెల్లవారుజామున విజయవాడలోని సింగ్ నగర్‌లో అదుపులోకి తీసుకున్నారు.

గీతాంజలి కేసులో టీడీపీ కార్యకర్త రాంబాబును అరెస్టు చేసిన పోలీసులు

సోషల్ మీడియాలో వేధింపులకు గురై బలవన్మరణానికి పాల్పడ్డ గీతాంజలి కేసులో ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ కార్యకర్త రాంబాబుని తెనాలి పోలీసులు ఇవాళ తెల్లవారుజామున విజయవాడలోని సింగ్ నగర్‌లో అదుపులోకి తీసుకున్నారు.

గీతాంజలి కామెంట్స్ పై ఎందుకు పోస్టులు పెట్టావంటూ రాంబాబును పోలీసులు ప్రశ్నలు అడిగారు. రాంబాబును పోలీసులు విజయవాడ నుంచి తెనాలి తీసుకువెళ్లారు. ఇళ్ల ప‌ట్టా వ‌చ్చింద‌న్న సంతోషంతో ఏపీ ముఖ్య‌మంత్రి జగన్, ఎమ్మెల్యే అన్నాబ‌త్తుని శివ‌కుమార్ పై అమితమైన అభిమానం చూపుతూ గీతాంజాలి మాట్లాడడంతో ఆమెపై సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్ జరిగింది.

దీంతో ఆమె రైలు కింద‌ప‌డి బలవన్మరణానికి పాల్పడింది. గీతాంజలికి భ‌ర్త గుంటి బాల‌చంద్ర‌, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పోలీసులు గీతాంజ‌లి కేసులో ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం గీతాంజలి కుటుంబానికి ఇప్పటికే రూ.20 లక్షల ఆర్థిక సాయం అందించిన విషయం తెలిసిందే.

గీతాంజలి మృతిపట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని ఇటీవలే చెప్పారు. ఆమె కుటుంబాన్ని ఆదుకోవడానికి తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. అమ్మాయిల గౌరవ ప్రతిష్ఠలకు భంగం కలిగించే ఏ ఒక్కరినీ చట్టం వదిలిపెట్టదని హెచ్చరించారు. సోషల్ మీడియాలో గీతాంజలిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందంటూ పోలీసులకు ఆమె కుటుంబ సభ్యులు పిర్యాదు చేశారు.

టీడీపీ రెండో లిస్టులో కొత్త ముఖాలా? సీనియర్సా?