Budde Kantarao : కోదాడ గేట్ ఇంజనీరింగ్ కాలేజీ ఓనర్ పై హత్యాయత్నం.. హత్య కోసం సుపారీ ఇచ్చిన కాలేజీ భాగస్వాములు
కాంతారావు ప్రయాణిస్తున్న కారును డీసీఎంతో ఢీ కొట్టాలని ప్లాన్ చేశారు. మునగాల (మం) మద్దెల చెరువు వద్ద కాంతారావు కారును ఢీకొట్టేందుకు సిఫారీ గ్యాంగ్ యత్నించారు.
![Budde Kantarao : కోదాడ గేట్ ఇంజనీరింగ్ కాలేజీ ఓనర్ పై హత్యాయత్నం.. హత్య కోసం సుపారీ ఇచ్చిన కాలేజీ భాగస్వాములు Budde Kantarao : కోదాడ గేట్ ఇంజనీరింగ్ కాలేజీ ఓనర్ పై హత్యాయత్నం.. హత్య కోసం సుపారీ ఇచ్చిన కాలేజీ భాగస్వాములు](https://10tv.in/wp-content/uploads/2023/06/Assassination-Attempt.jpg)
Assassination Attempt
Assassination Attempt : సూర్యాపేట జిల్లా కోదాడ గేట్ ఇంజనీరింగ్ కాలేజీ ఓనర్ పై హత్యాయత్నం జరిగింది. కోదాడ గేట్ ఇంజనీరింగ్ కాలేజీ ఓనర్ బుడ్డే కాంతారావును హత్య చేసేందుకు భాగస్వాములు సుపారీ ఇచ్చారు. హత్య కోసం రూ.50 లక్షలు ఇచ్చేందుకు సుపారీ గ్యాంగ్ తో ఒప్పందం కుదుర్చుకున్నారు. గేట్ కాలేజీ భాగస్వాములు ముందుగా ఐదు లక్షల రూపాయలు చెల్లించారు.
Tiger : నంద్యాల జిల్లాలో మహిళపై పెద్దపులి దాడికి యత్నం
కాంతారావు ప్రయాణిస్తున్న కారును డీసీఎంతో ఢీ కొట్టాలని ప్లాన్ చేశారు. మునగాల (మం) మద్దెల చెరువు వద్ద కాంతారావు కారును ఢీకొట్టేందుకు సిఫారీ గ్యాంగ్ యత్నించారు. కాంతారావు తప్పించుకుని వెళ్లిపోయారు. ఆ తర్వాత మరోసారి కోదాడ పట్టణంలో కాంతారావు కారును డీసీఎం ఢీకొట్టారు.
అప్పుడు స్వల్ప గాయాలతో కాంతారావు బయటపడ్డారు. బాధితుడు కాంతారావు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 12 మంది గ్యాంగ్ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. కాగా, కుట్రలో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నట్లు సమాచారం.