Ponguleti Srinivasa Reddy (Photo : X)
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు పొలిటికల్ హీట్ పెంచేశాయి. అధికారమే లక్ష్యంగా అన్ని పార్టీలు ముందుకు సాగుతున్నాయి. మూడోసారి హ్యాట్రిక్ విజయం సాధించాలని అధికార బీఆర్ఎస్ పట్టుదలగా ఉంది. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్, బీఆర్ఎస్ పోరాటం చేస్తున్నాయి. కాగా, ఎన్నికల్లో గెలుపుపై ఎవరికి వారు ధీమాగా ఉన్నారు. ఈసారి విజయం మాదే అంటే మాదే అంటున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ దే విజయం అంటున్నారు ఆ పార్టీ నేతలు. అంతేకాదు.. కాంగ్రెస్ ఎన్ని సీట్లు గెలుస్తుందో కూడా చెప్పేస్తున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 78 స్థానాల్లో గెలవబోతోందని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆ పార్టీ నేతలు జోస్యం చెబుతున్నారు.
Tummala Nageswara Rao With Media (Photo : Facebook)
తెలంగాణ ఎన్నికలు దేశ భవిష్యత్తు ఎన్నికలు-తుమ్మల
ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు, పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో జరిగే ఎన్నికలు దేశ భవిష్యత్తు ఎన్నికలుగా అభివర్ణించారు తుమ్మల. యావత్ తెలంగాణ.. ఖమ్మం వైపు చూస్తోందన్నారు. నాల్గవ పిల్లర్ అయిన మీడియా కూడా న్యాయం ధర్మం పక్షాన నిలబడాల్సిన అవసరం ఉందన్నారు. తనపైన, పొంగులేటిపైన ఖమ్మం, అశ్వారావుపేట పర్యటనలో సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను తుమ్మల ఖండించారు. మా చరిత్ర అంతా మీకు తెలుసు అని అన్నారు.
Also Read : కేసీఆర్ అలా చేస్తే కొడంగల్, కామారెడ్డి నియోజకవర్గాల్లో పోటీ నుంచి తప్పుకుంటా.. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
మా కోసం 3 నెలలు ఎందుకు తిరిగారు కేసీఆర్?-తుమ్మల
”నాకు కేసీఆర్ చిరకాల మిత్రుడు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కొంతకాల మిత్రుడు. మాపై ఖమ్మం, అశ్వారావుపేటలో కేసీఆర్ విమర్శలు చేశారు. ఆయన మా కంటే తెలివైన వారు. సాహిత్యం తెలిసిన వారు. ఇలా మాట్లాడడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా. ఎవడో అర్భకుడు రాసిచ్చిన స్క్రిప్ట్ ను ఎలా చదివారు. మేం కరకట దమనులం అయితే మా కోసం 3 నెలలు ఎందుకు తిరిగారు? ఆ అర్భకుడు రాసిన స్క్రిప్ట్ ను ఎలా చదివారో ఆయన విజ్ఞతకే వదిలేశా.
నేను ఏ పదవిలో ఉన్నా వాటికి వన్నె తెచ్చా. నా చిరకాల కోరిక గోదావరి జలాలతో ఖమ్మం జిల్లా ప్రజల కాళ్ళు కడగటమే. ఈ నెల 17న పినపాక నియోజకవర్గంలో రాహుల్ గాంధీ పర్యటనను జయప్రదం చేయండి” అని పిలుపునిచ్చారు తుమ్మల నాగేశ్వరరావు.
Ponguleti Srinivasa Reddy Election Campaign (Photo : X)
వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే-పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
”కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని బీఆర్ఎస్ వాళ్లకు తెలుసు. అందుకే ఆ పార్టీ నేతలు ఫ్రస్టేషన్ లో మాట్లాడుతున్నారు. ప్రజల గుండెల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది. డబ్బును నమ్ముకుని రాజకీయం చేస్తుంది మేము కాదు. బీఆర్ఎస్ పార్టీనే. డబ్బును నమ్ముకొని ఎవరు రాజకీయం చేస్తున్నారో తెలంగాణ ప్రజలకు కూడా తెలుసు. 72 నుంచి 78 సీట్లతో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుంది”.
Also Read : కాంగ్రెస్‌కు బిగ్ రిలీఫ్.. రెబల్స్‌తో చర్చలు సఫలం, మల్లు రవిపై దాడికి యత్నం, పటేల్ రమేశ్ రెడ్డి కంటతడి