Bandi Sanjay : ఓటుకి 10వేలు ఇస్తున్నారు- బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

మాయ చేసి దొంగచాటుగా డబ్బులు పంచుతున్నారని చెప్పారు. బీజేపీ కార్యకర్తలు డ్రెస్ లేని పోలీసుల్లా పని చేయాలని, పోలీసులకు సమాచారం ఇవ్వాలని బండి సంజయ్ కోరారు.

కరీంనగర్ అసెంబ్లీ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున డబ్బు పంచుతున్నారని చెప్పారు. ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమైందని తెలిసి సీఎంవో ఆదేశాల మేరకు డబ్బు పంపిణీ చేస్తున్నారని అన్నారు. మందకృష్ణ మాదిగ రావడం, బీజేపీ గెలుపు ఖాయం కావడంతో ఎలాగైనా అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణలు చేశారు.

బీఆర్ఎస్ అభ్యర్థికి కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారని, ఓటుకు 10వేలు ఇవ్వాలన్న ముఖ్యమంత్రి ఆలోచనతోనే ఇంత నీచానికి దిగజారారని ధ్వజమెత్తారు. సాక్ష్యాత్తు బీఆర్ఎస్ కార్పొరేటర్ భర్తనే ఎన్నికల అధికారికి గంగుల కమలాకర్ పై ఫిర్యాదు చేశారని తెలిపారు. కొంతమంది పోలీస్ అధికారులు గంగులకు సహకరిస్తున్నారని ఆయన ఆరోపించారు. కొత్తపల్లిలో ధర్నా ఏందని చూస్తే డబ్బు పంచుతున్నారని తేలిందన్నారు.

Also Read : ఓటర్లకు ముఖ్య గమనిక.. మీ పోలింగ్ స్టేషన్ ఎక్కడుందో తెలుసుకోవడం ఎలా? ఏయే డాక్యుమెంట్స్ వెంట తీసుకెళ్లాలి?

మాయ చేసి దొంగచాటుగా డబ్బులు పంచుతున్నారని చెప్పారు. దాదాపు 450 ఇళ్లల్లో ఇంటికి 10 వేలు ఇస్తుంటే పోలీస్ పెట్రోలింగ్ ఏమైంది? అని బండి సంజయ్ ప్రశ్నించారు. మధ్యాహ్నం 3గంటల నుంచి డబ్బు పంపిణీ జరుగుతోందన్నారు. కరీంనగర్ సీపీపై తమకు పూర్తి విశ్వాసం ఉందన్న బండి సంజయ్.. కింది స్థాయి అధికారులు కొందరు అధికార పార్టీకి చెంచాలుగా మారారని మండిపడ్డారు.

ఓటర్లు డబ్బులు తీసుకుంటారు.. కానీ, మంచి అభ్యర్థికే ఓటు వేస్తారని బండి సంజయ్ ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీ కార్యకర్తలు డ్రెస్ లేని పోలీసుల్లా పని చేయాలని, పోలీసులకు సమాచారం ఇవ్వాలని బండి సంజయ్ కోరారు. పోలీసులు సహకరించకుంటే మీరే పట్టుకున్న డబ్బును ప్రజలకు పంపిణీ చేయండి అని పిలుపునిచ్చారు బండి సంజయ్.

 

Also Read : ఎన్నికల్లో ఉపయోగించే సిరా హిస్టరీ మీకు తెలుసా?

ట్రెండింగ్ వార్తలు