Elections Ink : ఎన్నికల్లో ఉపయోగించే సిరా హిస్టరీ మీకు తెలుసా?

ఓటు వేసిన ప్రతి ఒక్కరి ఎడమచేతి చూపుడు వేలుపై సిరా చుక్క పెడతారు. అయితే కొన్నిరోజుల వరకు చెరిగిపోని ఆ సిరా ఎక్కడ తయావుతుంది? దాని చరిత్ర ఏంటో మీకు తెలుసా?

Elections Ink : ఎన్నికల్లో ఉపయోగించే సిరా హిస్టరీ మీకు తెలుసా?

Elections Ink : ఎప్పుడు ఎన్నికలు జరిగిన చాలా ముఖ్యమైన అంశం ఒకటి ఉంటుంది. అదే ప్రతి ఓటరు వేలు మీద చెరగని సిరా గుర్తు ఉంటుంది. అసలు ఈ సిరా ఎక్కడ తయారవుతుంది. దీని వెనుక ఉన్న చరిత్ర ఏంటో మీకు తెలుసా?

ఓటు వేయడానికి వెళ్లినపుడు చూపుడు ఎడమచేతి చూపుడు వేలుకి సిరా గుర్తు వేస్తారు. మోసపూరితమైన ఓట్ల నివారణ కోసం ఇలా చేస్తారు. అయితే ఈ సిరా అసలు ఎక్కడ తయారవుతుంది. దీని చరిత్ర ఏంటి అంటే? భారతదేశంలో 1951-52 లో జరిగిన మొట్టమొదటి ఎన్నికల సమయంలో చాలా చోట్ల మోసపూరితమైన ఓట్లు పడినట్లు ఎన్నికల సంఘం గుర్తించిందట.  ప్రజలు ఒకటి కంటే ఎక్కువ ఓట్లు వేయకుండా నిలువరించడానికి నేషనల్ ఫిజికల్ లాబొరేటరీ ఆఫ్ ఇండియా (NPL) ను సంప్రదించిన ఎన్నికల సంఘం సులభంగా తుడిచివేయడానికి వీలుకాని ప్రత్యేకమైన ఇంకు తయారు చేయమని కోరింది.

Telangana Assembly Elections 2023 : ఓటర్లకు ముఖ్య గమనిక.. మీ పోలింగ్ స్టేషన్ ఎక్కడుందో తెలుసుకోవడం ఎలా? ఏయే డాక్యుమెంట్స్ వెంట తీసుకెళ్లాలి?

ఆ సమయంలో NPL ఇంకు తయారీ కంపెనీ మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్‌ను సంప్రదించిందట. ఈ కంపెనీని 1937 లో మహారాజా కృష్ణరాజా వడియార్ IV స్ధాపించారు. అప్పట్లో ఆయన అత్యంత ధనవంతుల్లో ఒకరట. వీరి రాజకుటుంబానికి చెందిన శ్రీకంఠదత్త నరసింహరాజ వడియార్ కూడా ఉన్నారు. ఈ కంపెనీ రంగులు, పూతలు, వార్నిష్‌లు తయారు చేసినప్పటికీ సిరా తయారీ వల్ల అధిక ఆదాయాన్ని సంపాదిస్తోందట. అప్పట్లో NPL సంప్రదించిన ఈ కంపెనీ ఇప్పటి వరకు ఈ ఇంకు ఏకైక తయారీదారుగా ఉంది.

ఈ ఇంకు భారతదేశంతో పాటు ఆఫ్ఘనిస్తాన్, టర్కీ, లక్షద్వీప్, సింగపూర్, కెనడా దేశాలతో కలిపి 35 దేశాలకు సరఫరా అవుతోంది. ఈ సిరా ఒక బాటిల్‌లో 5ml ఇంకు ఉంటుంది. 300 మంది ఓటర్లకు అది సరిపోతుంది. ఎన్నికల వేళ నమోదు చేసుకున్న ఓటర్ల సంఖ్యను బట్టి సిరా కోసం భారత ఎన్నికల సంఘం ఈ ఇంకును ఆర్డర్ చేస్తుంది. ఇది ప్రధాన ఎన్నికల అధికారులకు సరఫరా చేస్తారు. అలా ఈ సిరా ఓటింగ్ కేంద్రాలకు పంపిణీ అవుతుంది.

Telangana Elections 2023 : ఓటు హక్కును వినియోగించుకోమని పిలుపునిస్తున్న సెలబ్రిటీలు

ఈ ఇంకు ఫార్ములా గురించి తెలియనప్పటికీ  దీనిలో చిన్న మొత్తంలో సిల్వర్ నైట్రేట్ వాడతారని చెబుతారు. 3 నుండి 4 వారాల పాటు ఓటర్ల వేలిపై చెరగకుండా ఉంటుంది. ఎటువంటి రసాయనం, ద్రావకంతో దానిని తుడిచివేయాలని ప్రయత్నించినా చెరగదు. సిరా చుక్కను ఓటర్లు గౌరవ చిహ్నంగా భావిస్తారు. ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ఎడమచేతి చూపుడు వేలుకు సిరా గుర్తు పెడతారు. ఒకవేళ ఆ వేలు లేకపోతే మధ్యవేలిపై సిరా గుర్తు పెడతారు. అదీ లేకుంటే ఉంగరపు వేలు.. అసలు చేతులే లేని వారికి ఎడమ చెంపపై సిరా గుర్తు పెడతారు.