ఓటర్లకు ముఖ్య గమనిక.. మీ పోలింగ్ స్టేషన్ ఎక్కడుందో తెలుసుకోవడం ఎలా? ఏయే డాక్యుమెంట్స్ వెంట తీసుకెళ్లాలి?

ఓటు హక్కు వినియోగించుకోవడానికి చేతిలో ఓటర్ కార్డు మాత్రమే ఉంటే సరిపోదు. ఓటర్ కార్డు ఉంది ఇక ఓటు వేసేయొచ్చు అనుకుంటే పొరపాటే.

ఓటర్లకు ముఖ్య గమనిక.. మీ పోలింగ్ స్టేషన్ ఎక్కడుందో తెలుసుకోవడం ఎలా? ఏయే డాక్యుమెంట్స్ వెంట తీసుకెళ్లాలి?

How To Find Your Polling Station (Photo : Google)

Telangana Assembly Elections 2023 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. నవంబర్ 30న పోలింగ్ జరగనుంది. పోలింగ్ సజావుగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఓటు వజ్రాయుధం లాంటిదని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని మేధావులు పిలుపునిచ్చారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు పౌరులు కూడా సిద్ధమవుతున్నారు. అయితే, ఓటర్లకు ముఖ్య గమనిక. ఓటు వేసే వారు కొన్ని కీలక విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొన్ని విషయాల పట్ల అవగాహన ఏర్పరచుకోవాలి. లేదంటే ఇబ్బందులు తప్పవు.

Also Read : ముగిసిన ఎన్నికల ప్రచారం.. ఈ రెండు రోజులు ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు?

ముందుగా ఓటర్లు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే.. తమ పోలింగ్ స్టేషన్ ఎక్కడ ఉంది? అనేది తెలుసుకోవడం ముఖ్యం. ఎందుకంటే.. తమకు కేటాయించిన పోలింగ్ బూత్ లోనే ఓటర్లు ఓటు వేయాల్సి ఉంటుంది. అందుకే, పోలింగ్ బూత్ ఎక్కడుంది అనేది తెలుసుకోవడం అవసరం. చేతిలో కేవలం ఓటర్ కార్డు ఉంటే సరిపోదు. ఓటర్ కార్డు ఉంది ఇక ఓటు వేసేయొచ్చు అనుకుంటే పొరపాటే అవుతుంది. ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటర్ కార్డు మాత్రమే ఉంటే సరిపోదు. కచ్చితంగా పోలింగ్ స్టేషన్ కు వెళ్లి ఓటు వేయాల్సి ఉంటుంది. అందుకే మీ పోలింగ్ బూత్ ఏదో తెలుసుకోవాల్సిందే. మరి మీ పోలింగ్ స్టేషన్ ఎక్కడుంది? అని తెలుసుకోవడం ఎలా? అంటే.. దానికొక మార్గం ఉంది.

Also Read : ఓటు హక్కును వినియోగించుకోమని పిలుపునిస్తున్న సెలబ్రిటీలు

పోలింగ్ స్టేషన్‌ను కనుక్కోవడం ఇలా..
* పోలింగ్ స్టేషన్ ను ఎలా కేటాయిస్తారు అంటే.. ఓటర్ యొక్క రెసిడెన్షియల్ అడ్రస్ మీద ఆధారపడి ఉంటుంది.
* నేషనల్ ఓటర్స్ సర్వీసెస్ పోర్టల్ ను(https://voters.eci.gov.in/) ఓపెన్ చేయాలి.
* Search In Electoral Roll (https://electoralsearch.eci.gov.in/) ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
* అక్కడ అవసరమైన డీటైల్స్ ఇవ్వాలి. (అంటే.. పేరు, తండ్రి పేరు, వయసు, లింగం, రాష్ట్రం, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గం). ఈ వివరాలు సమర్పించాలి.
* ఆ తర్వాత క్యాప్చా ఎంటర్ చేయాలి.
* ఆ తర్వాత పోలింగ్ స్టేషన్ వివరాలు తెలుసుకోవడానికి సెర్చ్ బటన్ పై క్లిక్ చేయాలి.
* అంతే.. మీ పోలింగ్ స్టేషన్ అడ్రస్ కనిపిస్తుంది. దాంతో పాటు సీరియల్ నెంబర్ ఉంటుంది.

ఇలా కూడా మీ పోలింగ్ స్టేషన్ ఏదో తెలుసుకోవచ్చు..
* నేషనల్ ఓటర్స్ సర్వీసెస్ పోర్టల్ ను(https://voters.eci.gov.in/) ఓపెన్ చేయాలి.
* Know Your Polling Station (https://electoralsearch.eci.gov.in/pollingstation) మీద క్లిక్ చేయాలి.
* ఆ తర్వాత ఎపిక్ నెంబర్ ఎంటర్ చేయాలి.
* ఆ తర్వాత క్యాప్చా ఎంటర్ చేసి సెర్చ్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
* అంతే, మీ పోలింగ్ బూత్ అడ్రస్ మీకు కనిపిస్తుంది.

Also Read : ఎన్నికల్లో ఉపయోగించే సిరా హిస్టరీ మీకు తెలుసా?

ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెంట తీసుకెళ్లాల్సిన పత్రాలు..
* ఓటు వేయడానికి ఓటర్లు కచ్చితంగా తమ ఓటరు సమాచార స్లిప్‌తో పాటు ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా గుర్తింపు పత్రాలను తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలి.
* పోలింగ్ కేంద్రాల లోపలికి సెల్‌ఫోన్లు, ఇయర్‌ఫోన్లు, కెమెరాలు, స్మార్ట్‌ వాచ్‌లు వంటి కొన్ని వస్తువులను తీసుకెళ్లడం నిషేధం. ఇది గుర్తుంచుకోవడం ముఖ్యం.

Also Read : నవంబర్ 30న పోలింగ్ రోజు అన్ని ప్రైవేట్ సంస్థలు సెలవు ప్రకటించాలి.. ఎలక్షన్ కమిషన్ ఆదేశం