Telangana Polls: ముగిసిన ఎన్నికల ప్రచారం.. ఈ రెండు రోజులు ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు?

ముఖ్యంగా రాజకీయ పార్టీలు, ప్రచారాల విషయంలో కొన్ని హెచ్చరికలు చేశారు. తెలంగాణలో సైలెంట్ పీరియడ్ మొదలైందని, సోషల్ మీడియాలో సైతం ఎన్నికల ప్రచారాన్ని నిలివివేయాలని ఆయన ఆదేశించారు.

Telangana Polls: ముగిసిన ఎన్నికల ప్రచారం.. ఈ రెండు రోజులు ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు?

తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగిసింది. మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రచారాన్ని నిలిపివేసినట్లు తెలంగాణ ఎన్నికల ముఖ్య అధికారి వికాస్ రాజ్ తెలిపారు. ఎన్నికల ప్రచారం ముగిసిన వెంటనే ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. పోలింగ్ ముగిసే వరకు గల నిబంధనల్ని వివరించారు. ఎవరైనా ఆ నిబంధనల్ని ఉల్లంఘిస్తే.. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముఖ్యంగా రాజకీయ పార్టీలు, ప్రచారాల విషయంలో కొన్ని హెచ్చరికలు చేశారు. తెలంగాణలో సైలెంట్ పీరియడ్ మొదలైందని, సోషల్ మీడియాలో సైతం ఎన్నికల ప్రచారాన్ని నిలిపివేయాలని ఆయన ఆదేశించారు.

ఏం చేయాలి, ఏం చేయకూడదో ఆదేశాలు ఇచ్చిన వికాస్ రాజ్
* స్థానికేతరులు నియోజకవర్గాలను వదిలి వెళ్లాలి
* ఏ రాజకీయ పార్టీ ఎలాంటి సమావేశం నిర్వహించకూడదు
* సైలెంట్ పీరియడ్ మొదలైంది
* ఎలాంటి ఎన్నికల మెటీరియల్ ప్రదర్శించకూడదు
* సోషల్ మీడియాలో కూడా ఎలాంటి ప్రచారం చేయకూడదు
* రాజకీయ ప్రకటనలు ఇవ్వకూడదు
* పోలింగ్ స్టేషన్లకు మొబైల్ అనుమతి లేదు
* పోలింగ్ ముగిసిన అరగంట తర్వాతనే ఎగ్జిట్ పోల్స్ ప్రవేశ పెట్టాలి
* ఓటరు స్లిప్పులపై పార్టీల గుర్తులు ఉండకూడదు
* టీవీలు, రేడియోలు, కేబుల్ నెట్ వర్కులలో ప్రచారం చేయకూడదు

* 27,094 కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఉంటుంది. 7,571 కేంద్రాల్లో బయట కూడా వెబ్ కాస్టింగ్ ఉంటుంది
* మోక్ పోలింగ్ 90నిమిషాల ముందు పోలింగ్ ప్రారంభానికి ముందు ఉంటుంది
* పోలింగ్ సిబ్బంది ఉదయం 5.30నిమిషాలకు వారి కేంద్రాల వద్ద ఉండాలి
* EVM లను పోలింగ్ ఏజెంట్లు ముట్టుకోవద్దు
* EVM ల తరలింపు కోసం ప్రత్యేకంగా రూట్ మ్యాప్. ఎక్కడా ఆగకుండా వెళ్ళాలి
* 12 గుర్తింపు కార్డులలో ఎదైనా చూపించి ఓటు వేయొచ్చు
* రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మూమెంట్, ప్రతి వాహనాన్ని మానిటరింగ్ చేయాలని డీఈవోలకు ఆదేశాలు
* రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో ఉంటుంది. 5గురి కంటే ఎక్కువ గుమిగుడితే కఠిన చర్యలు

లా అండ్ ఆర్డర్ నిబంధనలు
* ఎన్నికలు ముగిసే వరకు మద్యం, కల్లు దుకాణాలు బంద్
* హైదరాబాద్ నగరంలో అమల్లోకి 144 సెక్షన్
* ఐదుగురికి మించి ఎక్కడైనా గుమిగూడరాదు
* హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల ఆదేశాలు