Telangana Final Exit Poll Results 2023 : తెలంగాణలో గెలిచేది ఈ పార్టీనే..! ఇండియా టుడే-మై యాక్సిస్ సంచలన ఎగ్జిట్ పోల్స్‌

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కాంగ్రెస్ ఓటు శాతం గణనీయంగా పెరిగిందని ఇండియా టుడే మై యాక్సిస్ ఎగ్జిట్ పోల్స్ సర్వేలో వెల్లడైంది.

India Today Axis Exit Polls On Telangana Assembly Elections 2023

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఇండియా టుడే యాక్సిస్ మై(India Today Axis My India) ఇండియా సంస్థ సంచలన ఎగ్జిట్ పోల్స్ వెల్లడించింది. ఇండియా టుడే సర్వే సంస్థ తన ఎగ్జిట్ పోల్ లో కాంగ్రెస్ కే పట్టం కట్టింది. ఈ ఎన్నికల్లో హస్తం పార్టీ అధికారంలోకి వస్తుందని అంచనా వేసింది. కాంగ్రెస్ కు 63 నుంచి 73 సీట్లు రావొచ్చని తెలిపింది. బీఆర్ఎస్.. 34 నుంచి 44 సీట్లకే పరిమితం అవుతుందని వెల్లడించింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కాంగ్రెస్ ఓటు శాతం గణనీయంగా పెరిగిందని ఇండియా టుడే మై యాక్సిస్ ఎగ్జిట్ పోల్స్ సర్వేలో వెల్లడైంది. నిన్న అంతా సర్వే చేసిన ఇండియా టుడే.. ఒక రోజు ఆలస్యంగా తెలంగాణ ఎగ్జిట్ పోల్స్ ప్రకటించింది.

కాగా, పోలింగ్ ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. కొన్ని సంస్థలు బీఆర్ఎస్ కు పట్టం కట్టగా, మరికొన్ని సంస్థలు కాంగ్రెస్ కు జై కొట్టాయి. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ దే అధికారం అని తేల్చాయి. ఇప్పుడు.. ఇండియా టుడే- మై యాక్సిస్ సర్వే సంస్థ కూడా కాంగ్రెస్ దే విజయం అని చెప్పడం ఆసక్తికరంగా మారింది. కాగా, 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న తెలంగాణలో.. ప్రభుత్వం ఏర్పాటుకు 60 సీట్లు గెలవాల్సి ఉంటుంది.

Also Read : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేదెవరు? 10టీవీ గ్రౌండ్ రిపోర్ట్

 

ఇండియా టుడే-ఎక్సిస్ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు..

ఏ పార్టీకి ఎన్ని సీట్లు..
బీఆర్ఎస్ – 34-44
కాంగ్రెస్ – 63-73
బీజేపీ – 04-08
ఇతరులు – 05-08

తెలంగాణ సీఎం ఎవరైతే బాగుంటుంది? ప్రజాభిప్రాయం ఇలా..
కేసీఆర్: 32%
రేవంత్: 21%
కాంగ్రెస్ నుంచి ఎవరైనా: 22%

తెలంగాణలో ఎవరు సీఎం అయితే బాగుంటుంది అని ఇండియా టుడే నిర్వహించిన సర్వేలో ప్రజలు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. కేసీఆర్ మరోసారి సీఎం కావాలని 32శాతం మంది ప్రజలు కోరుకున్నారు. కాంగ్రెస్ నుంచి ఎవరైనా ఫరవాలేదని 22శాతం మంది ప్రజలు కోరుకోగా.. రేవంత్ రెడ్డి సీఎం అయితే బాగుంటుందని 21శాతం మంది ప్రజలు కోరుకున్నట్లు సర్వేలో వెల్లడైంది.

రూరల్, అర్బన్ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకే ఓటర్లు పట్టం కట్టినట్టు ఇండియా టుడే సర్వే సంస్థ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు కాంగ్రెస్ పార్టీవైపు మొగ్గు చూపినట్టు సమాచారం.

రూరల్ ఓటింగ్
బీఆర్ఎస్: 35%
కాంగ్రెస్: 44%
బీజేపీ: 14%
ఎంఐఎం: 0%
ఇతరులు: 7%

అర్బన్ ఓటింగ్
బీఆర్ఎస్: 36%
కాంగ్రెస్: 41%
బీజేపీ: 15%
ఎంఐఎం: 7%
ఇతరులు: 1%

పురుషుల ఓటింగ్ శాతం
బీఆర్ఎస్: 34%
కాంగ్రెస్: 43%
బీజేపీ: 15%
ఎంఐఎం: 3%
ఇతరులు: 5%

మహిళల ఓటింగ్ శాతం
బీఆర్ఎస్: 38%
కాంగ్రెస్: 41%
బీజేపీ: 13%
ఎంఐఎం: 3%
ఇతరులు :5%

Also Read : తెలంగాణ కింగ్ ఎవరు? మూడు పార్టీల్లో ముఖ్యుల జాతకాలు ఎలా ఉన్నాయి

సర్వేను పరిశీలిస్తే.. హైదరాబాద్ లో బీఆర్ఎస్ ఆధిపత్యం కొనసాగనుంది. సిటీలోని 21 సీట్లలో బీఆర్ఎస్ 11, కాంగ్రెస్ 3, ఎంఐఎం 6 స్థానాల్లో విజయం సాధించే అవకాశాలున్నాయి. గతంతో పోలిస్తే బీఆర్ఎస్, ఎంఐఎం ఒక్కో సీటు కోల్పోయినున్నాయని అంచనా. కాంగ్రెస్ అదనంగా 2 సీట్లు గెలిచే అవకాశముంది.

హైదరాబాద్ అంచనా
బీఆర్ఎస్: 11 సీట్లు (36%)
కాంగ్రెస్: 3 సీట్లు (28%)
బీజేపీ: 1 సీట్ (16%)
ఎంఐఎం: 6 (15%)
ఇతరులు: 0 (5%)

ప్రాంతాలవారీగా చూసుకుంటే దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం చూపే అవకాశముంది. ఉత్తర తెలంగాణలోనూ హస్తం పార్టీ హవా చూపనుందని తెలుస్తోంది.

దక్షిణ తెలంగాణ అంచనా
బీఆర్ఎస్: 6 సీట్లు (35%)
కాంగ్రెస్: 27 సీట్లు (51%)
బీజేపీ: 1 సీట్ (8%)
ఎంఐఎం: 0
ఇతరులు: 0 (6%)

ఉత్తర తెలంగాణ అంచనా
బీఆర్ఎస్: 13 సీట్లు (35%)
కాంగ్రెస్: 15 సీట్లు (39%)
బీజేపీ: 5 సీట్లు (21%)
ఎంఐఎం: 0
ఇతరులు: 0 (5)%

మైనారిటీలు బీఆర్ఎస్ పార్టీ వెంటే ఉన్నారని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. అయితే గత ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీకి మైనారిటీల ఓటింగ్ 5 శాతం పెరిగినట్టు అంచనా.

మైనారిటీల ఓటింగ్ అంచనా
బీఆర్ఎస్: 41%
కాంగ్రెస్: 37%
బీజేపీ: 4%
ఎంఐఎం: 14%
ఇతరులు: 4%

 

 

 

ట్రెండింగ్ వార్తలు