10TV Exclusive Report : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేదెవరు? 10టీవీ గ్రౌండ్ రిపోర్ట్
119 నియోజకవర్గాలపై 10టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ఏం చెబుతోంది..? ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమవుతాయా..? స్థానికంగా వాస్తవాలు ఎలా ఉన్నాయి..?

10TV Exclusive Report On Exit Polls
Telangana Assembly Election 2023: తెలంగాణ అసెంబ్లీ పోలింగ్ ముగిసింది. నేతలంతా ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మరోపక్క ఈసీ ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది. పోలింగ్ ముగిశాక ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు చేస్తామంటూ ధీమాగా ఉంది. మరోపక్క గులాబీ దళం మాత్రం ఈ ఎగ్జిట్ పోల్స్ అన్నీ ట్రాష్ అని గెలుపు తమదే అని అంటోంది. ఇప్పటికే తెలంగాణ ఎన్నికల ఫలితాలపై ఎన్నో సర్వేలు జరిగాయి. ఎవరి అభిప్రాయాలు వారు వెల్లడించారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలపై కూడా ఎవరు నమ్మకాలు వారికున్నాయి. ఎవరు అభిప్రాయాలు వారు వెల్లడిస్తున్నారు.
ఇదిలా ఉంటే 10టీవీ రిపోర్టర్లు ఉదయం నుంచి రాత్రి వరకు పోలింగ్ జరిగిన విధానాన్ని దగ్గరగా పరిశీలించి, విశ్లేషించారు. వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయి..? కాంగ్రెస్ గెలుపు ధీమా ఎంత వరకు నిజమవుతుంది…? గులాబీ పార్టీ ఆశలు ఎంత వరకు ఫలిస్తాయి..? ప్రజలు ఏమన్నాకుంటున్నారు..? ఓటర్లు నాడి ఎలా ఉంది..? ఉమ్మడి 10 జిల్లాల వారీగా ఫీల్డ్ రిపోర్టు ఎలా ఉంది…? 119 నియోజకవర్గాల్లో గెలుపోటములపై 10టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ఈ వీడియోలో చూడండి.