Balanagar Murder : బాలానగర్‌లో దారుణం.. రూ.400 కోసం హత్య, లారీ కిందకు తోసేశాడు..
హైదరాబాద్ బాలానగర్ లో దారుణం జరిగింది. రూ.400 కోసం ఓ మనిషిని నడిరోడ్డుపై చంపేశాడు.

Balanagar Murder : హైదరాబాద్ బాలానగర్ లో దారుణం జరిగింది. రూ.400 కోసం ఓ మనిషిని నడిరోడ్డుపై చంపేశాడు. బాలానగర్ లోని నర్సాపూర్ చౌరస్తాలో ఇద్దరు కూలీలు కాశీరాం, శ్రీనివాస్ మధ్య 400 రూపాయల కోసం వాగ్వాదం జరిగింది.
ఇద్దరూ ఫుట్ పాత్ పై నిలబడి గొడవపడ్డారు. ఆవేశంలో శ్రీనివాస్ ను కర్రతో కొట్టాడు కాశీరాం. అంతటితో అతడి కోపం చల్లారలేదు. అటుగా వస్తున్న లారీ కొందకు తోసేశాడు. శ్రీనివాస్ మీదుగా లారీ దూసుకెళ్లడంతో అతడు స్పాట్ లోనే చనిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు.
Also Read..Tunisha Sharma Suicide : ప్రముఖ యువ నటి ఆత్మహత్య.. మేకప్ రూమ్‌లోనే ఉరి వేసుకుంది
”శ్రీనివాస్ ఫుట్ పాత్ మీద పడుకుని ఉన్నాడు. అతడి దగ్గరికి వచ్చిన కాశీరామ్.. 400 రూపాయల విషయమై గొడవపడ్డాడు. ఈ క్రమంలో కర్రతో కొట్టాడు. ఆ తర్వాత లారీ వస్తుండటాన్ని గమనించాడు. కోపంతో శ్రీనివాస్ ను లారీ కిందకు తోసేశాడు. లారీ టైర్లు మీద ఎక్కడంతో శ్రీనివాస్ అక్కడికక్కడే మరణించాడు” అని పోలీసులు వెల్లడించారు.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.
ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో ఈ దారుణం జరిగింది. కేవలం 400 రూపాయల కోసం ఈ ఘోరానికి ఒడిగట్టాడు కాశీరామ్. ఇద్దరూ కూడా రోజువారి కూలీలే. 400 రూపాయల కోసం వ్యక్తిని హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.