BJP : నేడు బీజేపీ మూడో విడత జాబితా విడుదల

బీజేపీ కేంద్ర ఎన్నిక కమిటీ సమావేశం అయింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేసింది.

BJP : నేడు బీజేపీ మూడో విడత జాబితా విడుదల

BJP candidates third list

Updated On : November 2, 2023 / 8:24 AM IST

BJP Candidates Third List : బీజేపీ మూడో విడత జాబితా నేడు విడుదల కానుంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నారు. గురువారం ఉదయం 10 గంటలకు అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఇందుకోసం కసరత్తు పూర్తి చేసింది. మూడో జాబితాలో 40 – 45 అసెంబ్లీ స్థానాలకు పార్టీ అభ్యర్థులను ప్రకటించబోతుంది.

నిన్న (బుధవారం) రాత్రి బీజేపీ కేంద్ర ఎన్నిక కమిటీ సమావేశం అయింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేసింది. సుదీర్ఘంగా చర్చించి అభ్యర్థులను ఎంపిక చేసింది.

CM KCR : కారు చీకట్లు.. ఏపీలో పరిస్థితులపై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

ప్రధాని మోదీ, అమిత్ షా, నడ్డాతో పాటు రాష్ట్రానికి చెందిన కిషన్ రెడ్డి, డీకే అరుణ, ఈటల రాజేందర్, బండి సంజయ్ పాల్గొన్నారు. ఇద్దరు, ముగ్గురు అభ్యర్థులు ఉన్న చోట ఎవరైతే బెస్ట్ అనేది రాష్ట్ర నేతల అభిప్రాయాలు తీసుకుని అభ్యర్థులను ఎంపిక చేశారు.