Bandi Sanjay
BJP MP Bandi Sanjay Arrest Issue : బీజేపీ ఎంపీ బండి సంజయ్ అరెస్ట్ వ్యవహారంపై లోక్‌సభ ప్రివిలేజ్ కమిటీ సీరియస్‌గా స్పందించింది. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి సహా పలువురు ఉన్నతాధికారులు, పోలీసులుకు నోటీసులు జారీచేసింది. హోం శాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ గుప్తా, కరీంనగర్ సీపీ సత్యనారాయణ, కరీంనగర్ ఏసీపీ శ్రీనివాసరావు, జగిత్యాల డీఎస్పీ ప్రకాష్, కరీంనగర్ సీఐ లక్ష్మీబాబుకి నోటీసులు జారీచేసింది. వీరందరినీ ఫిబ్రవరి 3వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు తమ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని ప్రివిలేజ్ కమిటి ఆదేశించింది.
Read More : UP CM Face : సీఎం అభ్యర్థిపై మాటమార్చిన ప్రియాంక
ఢిల్లీలో లోక్‌సభ ప్రివిలేజ్ కమిటి ఎదుట ఎంపీ బండి సంజయ్ హాజరై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిదే. రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా తెలంగాణ ప్రభుత్వం జీవో 317 తెచ్చిందని, దీంతో.. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులు నష్టపోతున్నారని ప్రివిలేజ్ కమిటి దృష్టికి తీసుకెళ్లారు. జీవో 317ను సవరించాలని ఈ నెల 2న తన కరీంనగర్‌లోని తన కార్యాలయంలో కోవిడ్ నిబంధనలు అనుసరిస్తూ దీక్షకు దిగితే.. పోలీసులు తనను అక్రమంగా అరెస్ట్ చేశారని ఫిర్యాదులో తెలిపారు. తన హక్కులకు భంగం కలిగించేలా పోలీసులు వ్యవహరించరన్నారు. 2019లో ఒకసారి పోలీసులు తనపై దాడి చేశారని ఇది రెండోసారి అని ప్రివిలేజ్ కమిటికి వివరించారు.
Read More : Reliance Digital : ‘డిజిటల్ ఇండియా సేల్’.. అదిరిపోయే ఆఫర్లు, ఆకర్షణీయమైన డిస్కౌంట్లు!
ఎంపీగా తన హక్కులకు భంగం కలిగించడంతో పాటు అధికారాలను ఉల్లంఘించిన కరీంనగర్ పోలీస్ కమిషనర్ సత్యనారాయణపై చర్యలు తీసుకోవాలని ప్రివిలేజ్ కమిటీని కోరారు బండి సంజయ్. సీపీతో పాటు హుజూరాబాద్ ఏసీపీ కోట్ల వెంకట్‌రెడ్డి, జమ్మికుంట ఇన్‌స్పెక్టర్ రాంచందర్‌రావు, హుజూరాబాద్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, కరీంనగర్ టూటౌన్ ఇన్‌స్పెక్టర్ నరేశ్…మరికొంతమంది గుర్తు తెలియని ఇతర పోలీస్ సిబ్బందిపై కూడా చర్యలు తీసుకోవాలన్నారు. తన కార్యాలయంలో ఆ రోజు ఏం జరిగిందనేదానిపై వీడియో క్లిప్పింగ్స్‌ను ప్రివిలేజ్ కమిటికి సమర్పించారు. వాటిని పరిశీలించిన కమిటి… సంజయ్‌ను అరెస్ట్ చేయడంపై సీరియస్‌గా స్పందించింది.