UP CM Face : సీఎం అభ్యర్థిపై మాటమార్చిన ప్రియాంక
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌పై ప్రియాంక గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఆయన చేరిక ప్రయత్నాలు విఫలం కావడంపై నోరు విప్పారు...

Priyanka Gandhi
Priyanka Gandhi : యూపీ కాంగ్రెస్ సీఎం అభ్యర్థిని ఎవరు అంటే..తానే అంటూ హింట్ ఇచ్చారు ప్రియాంక గాంధీ. కానీ..24 గంటలు దాటకముందే..మాట మార్చేశారు. జస్ట్ జోక్ చేశానంటూ…తెలిపారు. దీంతో నాయకులు నోరెళ్లబెడుతున్నారు. ప్రస్తుతం తాను పార్టీ ప్రధాన కార్యదర్శి బాధ్యతల్లో ఉన్నట్లు, అధికారికంగా వారే సీఎం, వీరే సీఎం అని చెప్పాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. యూపీ సీఎం అభ్యర్థిని తానేనన్న ఊహల్లో ఉండొద్దని, ప్రస్తుతం తాను పార్టీ ప్రధాన కార్యదర్శినని, ఆ పనులను నిర్వర్తిస్తున్నట్లు ప్రియాంక తెలిపారు.
Read More : Reliance Digital : ‘డిజిటల్ ఇండియా సేల్’.. అదిరిపోయే ఆఫర్లు, ఆకర్షణీయమైన డిస్కౌంట్లు!
మరోవైపు…రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌పై ప్రియాంక గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఆయన చేరిక ప్రయత్నాలు విఫలం కావడంపై నోరు విప్పారు. వాస్తవంగా కాంగ్రెస్ పార్టీలో ప్రశాంత్ కిశోర్ చేరాల్సిందని.. కానీ అది జయప్రదం కాలేదన్నారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయని పేర్కొన్నారు ప్రియాంక. కొంత వరకు తాము కూడా కారణం కావచ్చని చెప్పారు. కానీ అందుకు కారణాలపై పూర్తి వివరాలను వెల్లడించడానికి ఆమె నిరాకరించారు. కొన్ని అంశాలపై విస్తృత ప్రాతిపదికన అంగీకారం కుదిరే అవకాశం లేదన్నారు. బయటి వ్యక్తిని కాంగ్రెస్‌లోకి తీసుకోవడానికి అయిష్టత ఉందన్న ప్రచారాన్ని ఆమె ఖండించారు. ప్రశాంత్ కిశోర్‌ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే విషయమై అయిష్టత ఉంటే, చర్చోపచర్చలు జరిగేవి కాదన్నారామె.
Read More : Afghanistan – India: అతి త్వరలో భారత్ నుంచి పాక్ మీదుగా ఆఫ్ఘన్‌కు చేరనున్న గోధుమలు
యూపీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ యూత్ మేనిఫెస్టోను ఆమె విడుదల చేశారు. యువజన కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ఎన్నో ప్రజాకర్షక వాగ్దానాలు చేసింది కాంగ్రెస్. యూపీలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, అందులో 8 లక్షల ఉద్యోగాలు మహిళలకు రిజర్వేషన్ కింద ఇస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్. రిక్రూట్‌మెంట్ చట్టంలోని ఐదు విభాగాల్లో యువత ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై దృష్టి సారించినట్లు కాంగ్రెస్ పేర్కొంది.
ఉత్తరప్రదేశ్ లో ఫిబ్రవరి 10నుంచి జరగనున్న ఏడు దశల ఎన్నికల ప్రకియలో 403 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 10, 14, 20, 23, 27, మార్చి 3, మార్చి 7తేదీల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎన్నికల కౌంటింగ్ మార్చి10నుంచి మొదలవుతుంది.