DK Aruna: 10టీవీ వీకెండ్ పాడ్‌కాస్ట్‌లో బీజేపీ ఎంపీ డీకే అరుణ పలు అంశాలపై మాట్లాడారు. కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ భవిష్యత్ ఏంటి? బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా? దీనిపై డీకే అరుణ రియాక్షన్ ఏంటంటే..
”బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పదే పదే అధికారంలోకి వస్తోంది. తెలంగాణలో ఇప్పటివరకు ఎవరూ కూడా బీజేపీ అధికారాన్ని చూడలేదు, రుచి చూడలేదు, అనుభవించ లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ ఆ అవకాశం రాలేదు. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న వాతావరణం చూస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం మరో మూడేళ్లు మాత్రమే అధికారంలో ఉంటుంది. ఈ మూడేళ్ల తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. అధికారంలోకి తీసుకురాగలం అన్న విశ్వాసం కూడా మాకు ఉంది.
దేశవ్యాప్తంగా ఎక్కడన్నా చూడండి.. తాజాగా జరిగిన బిహార్ ఎన్నికలు, అంతకముందు హర్యానా, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో బీజేపీనే అధికారంలో ఉంది. నార్త్ తో పోలిస్తే అక్కడున్నంత స్ట్రాంగ్ గా సౌత్ లో బీజేపీ లేదు. కర్నాటకలో స్ట్రాంగ్ గానే ఉంది. లాస్ట్ టైమ్ అనేక రకాల హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.
ఇక ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఉంది. నెక్ట్స్ కర్నాటకలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తుంది. కాంగ్రెస్ ఐదు గ్యారెంటీల నినాదానికి తోడు బీజేపీలో జరిగిన కొన్ని పరిణామాలతో.. కర్నాటకలో కాంగ్రెస్ పవర్ లోకి వచ్చింది” అని ఎంపీ డీకే అరుణ అన్నారు.
Also Read: పవన్ కల్యాణ్ సనాతన ధర్మంపై బండి సంజయ్ సంచలన కామెంట్స్.. హిందువులకు కీలక సూచన