JP Nadda Met Hero Nitin : హీరో నితిన్ తో జేపీ నడ్డా భేటీ..చర్చనీయాంశంగా మారిన సమావేశం

హీరో నితిన్ తో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో భేటీ అయ్యారు. వరంగల్‌ సభ ముగించుకుని నోవాటెల్‌ చేరుకున్న నడ్డా.. నితిన్ తో భేటీ అయ్యారు. అరగంట నుంచి ఈ ఇద్దరి మధ్య సమావేశం కొసాగుతోంది. వీరిద్దరూ ఏ అంశాలపై చర్చిస్తున్నారనేది పొలిటికల్ సర్కిల్స్‌లో ఆసక్తిగా మారింది.

JP Nadda Met Hero Nitin : హీరో నితిన్ తో జేపీ నడ్డా భేటీ..చర్చనీయాంశంగా మారిన సమావేశం

Hero Nitin met JP Nadda

Updated On : August 27, 2022 / 8:43 PM IST

JP Nadda met Hero Nitin : హీరో నితిన్ తో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో భేటీ అయ్యారు. వరంగల్‌ సభ ముగించుకుని నోవాటెల్‌ చేరుకున్న నడ్డా.. నితిన్ తో భేటీ అయ్యారు. అరగంట నుంచి ఈ ఇద్దరి మధ్య సమావేశం కొసాగుతోంది. వీరిద్దరూ ఏ అంశాలపై చర్చిస్తున్నారనేది పొలిటికల్ సర్కిల్స్‌లో ఆసక్తిగా మారింది. ఇవాళ మధ్యాహ్నం క్రికెటర్‌ మిథాలీరాజ్‌తో నడ్డా భేటీ అయ్యారు. ఇప్పుడు నితిన్‌తో సమావేశమవడం.. చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే ఎన్టీఆర్ తో అమిత్‌షా భేటీ అయ్యారు.

BJP Leaders Meet celebrities : తెలంగాణలో ఆసక్తికర పరిణామాలు..సినీ స్టార్స్, మాజీ క్రీడాకారులతో బీజేపీ అగ్రనేతలు భేటీ

అంతకముందు వరంగల్‌ సభలో జేపీ నడ్డా ప్రసంగించారు. కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతికి పర్యాయపదంగా మారిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ ఏటీఎంలా వాడుకుంటున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ నయా నిజాం మారారని విమర్శించారు. తెలంగాణలో నిర్బంధ కాండ కొనసాగించాలని ఉత్తర్వులు ఇస్తున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌ను ఓడించి, ఇంట్లో కూర్చోబెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.