BJP Leaders Meet celebrities : తెలంగాణలో ఆసక్తికర పరిణామాలు..సినీ స్టార్స్, మాజీ క్రీడాకారులతో బీజేపీ అగ్రనేతలు భేటీ

తెలంగాణలో బీజేపీ ఆసక్తికర పరిణామాలకు తెరలేపింది. వరుసగా సినీ స్టార్స్, మాజీ క్రీడాకారులు, ప్రముఖులతో భేటీ అవుతూ... బీజేపీ టాప్ లీడర్స్ సంచలనాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా తెలంగాణను మార్చారు. ఇప్పటికే ఎన్టీఆర్‌తో అమిత్‌ షా... ఇప్పుడు మాజీ క్రికెటర్ మిథాలీరాజ్‌తో బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా భేటీ కావడం తెలంగాణ పాలిటిక్స్‌లో చర్చనీయాంశంగా మారింది.

BJP Leaders Meet celebrities : తెలంగాణలో ఆసక్తికర పరిణామాలు..సినీ స్టార్స్, మాజీ క్రీడాకారులతో బీజేపీ అగ్రనేతలు భేటీ

BJP Leaders Met Film Stars And Former Sportspersons

BJP Leaders Meet celebrities : తెలంగాణలో బీజేపీ ఆసక్తికర పరిణామాలకు తెరలేపింది. వరుసగా సినీ స్టార్స్, మాజీ క్రీడాకారులు, ప్రముఖులతో భేటీ అవుతూ… బీజేపీ టాప్ లీడర్స్ సంచలనాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా తెలంగాణను మార్చారు. ఇప్పటికే ఎన్టీఆర్‌తో అమిత్‌ షా… ఇప్పుడు మాజీ క్రికెటర్ మిథాలీరాజ్‌తో బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా భేటీ కావడం తెలంగాణ పాలిటిక్స్‌లో చర్చనీయాంశంగా మారింది. వరంగల్ పర్యటన కోసం హైదరాబాద్ వచ్చిన నడ్డా… శంషాబాద్‌లోని నోవాటెల్ హోటల్‌లో మిథాలీతో భేటీ అయ్యారు. మిథాలీ… నడ్డాకు పుష్పగుచ్చం అందించి అభివాదం తెలిపారు. నడ్డా కూడా మిథాలీకి శాలువా కప్పి సత్కరించారు.

అనంతరం జేపీ నడ్డా… మిథాలీ రాజ్ మధ్య అరగంట పాటు చర్చ జరిగింది. అయితే వీరిద్దరు ఏ అంశంపై చర్చించారనేది సస్పెన్స్‌గా మారింది. ఈ భేటీకి ఏమైనా రాజకీయ సంబంధమైందా? లేక మర్యాదపూర్వకంగా జరిగిందా? అనే దానిపై పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్‌ హాట్‌ చర్చ నడుస్తోంది. మర్యాదపూర్వకంగా జరిగితే.. ఇప్పుడే ఎందుకని ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికిప్పుడు సినీ స్టార్స్, మాజీ క్రీడాకారులను కలవడం ఎవరికి అంతుబట్టడం లేదు.

Minister KTR : మతాల పేరుతో కొట్టుకు చావమని ఏ దేవుడు చెప్పాడు? మంత్రి కేటీఆర్ ఆగ్రహం

39 ఏళ్ల మిథాలీ రాజ్‌ ఉమెన్ క్రికెట్‌లో తనదైన మార్క్ వేశారు. 23 ఏళ్ల కెరీర్‌లో టీమిండియాకు ఎన్నో విజయాలు, మరెన్నో రికార్డ్‌లు క్రియేట్ చేసింది. ఇటీవల అన్ని ఫార్మాట్లకు గుడ్‌ బై చెప్పారు మిథాలీ. త్వరలో రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందని ఈ మధ్య కాలంలో ప్రచారం జరుగుతోంది. ఈ మధ్యే మిథాలీ రాజ్‌పై సినిమా కూడా వచ్చింది. ఈ క్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, మిథాలీ మధ్య భేటీ ఆసక్తికరంగా మారింది. క్రికెట్‌లో జోష్‌ పాలిటిక్స్‌లో కంటిన్యూ చేస్తారా అనే చర్చ జరుగుతోంది.

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉంది. కానీ ఇప్పటి నుంచే రాజకీయ పార్టీలు ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నాయి. ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాయి. ఎవరికి వారు ప్రత్యేక వ్యూహాలకు పదునుపెడుతుండగా.. ఈ విషయంలో బీజేపీ కాస్త డిఫరెంట్‌గా ముందుకెళ్తున్నట్లు తాజా పరిణామాలను బట్టి తెలుస్తోంది.

JP Nadda To Meet Actor Nithin : నిన్న జూ.ఎన్టీఆర్‌, నేడు నితిన్‌.. తెలుగు హీరోలపై కన్నేసిన బీజేపీ హైకమాండ్.. నడ్డాతో భేటీ కానున్న నితిన్

ఈనెల 21న కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పర్యటించి రాష్ట్రంలో రాజకీయ అలజడికి తెరలేపగా, తాజా రాజకీయ పరిణామాల మధ్య జేపీ నడ్డా ఎలాంటి కీలక సందేశం పార్టీ శ్రేణులకు ఇవ్వబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. సాయంత్రం మరో టాలీవుడ్ హీరో నితిన్‌ కూడా జేపీ నడ్డాను కలువబోతున్నారు. నోవాటెల్‌ హోటల్‌లో వీరిద్దరి భేటీ ఉండనుంది.