Bjp Senior Leader Ex Mp Chendupatla Janga Reddy Passes Away
BJP Leader chendupatla janga reddy passes away : బీజేపీ సీనియర్ నేత చందుపట్ల జంగారెడ్డి కన్నుమూశారు. 87 ఏళ్ల జంగారెడ్డి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. ఈక్రమంలో ఆరోగ్యం విషమించి శనివారం (ఫిబ్రవరి 5,2022) ఉదయం తుదిశ్వాస విడిచారు. జంగారెడ్డి పార్థివదేహాన్ని నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయానికి తీసుకొచ్చారు. అక్కడికి చేరుకున్న బీజేపీ నేతలు..అభిమానులు ఆయన పార్థీవదేహానికి నివాళులు అర్పించారు. జంగారెడ్డి వరంగల్ జిల్లాలో నవంబర్ 18, 1935న జన్మించారు. ప్రస్తుతం హన్మకొండలో నివాసిస్తున్నారు. జంగారెడ్డి రాజకీయాల్లోకి రాకముందు ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా పనిచేశారు.
హనుమకొండ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి మాజీ దివంగత ప్రధాని పీవీ నరసింహారావు ఓడించి సంచలనం సృష్టించారు జంగారెడ్డి. చందుపట్ల భారతీయ జనతా పార్టీలో చందుపట్ల బీజేపీ సీనియర్ నేతలు అటల్ బిహారీ వాజ్పేయి, ఎల్.కె అద్వానీ సమకాలికులు పార్లమెంటులో గతంలో బిజెపికి విజయం సాధించిన రెండు సీట్లలో ఒకరు చందుపట్ల కాగా మరొకరు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పాయ్.
జంగారెడ్డి 1967లో భారతీయ జనసంఘ్ పార్టీ నుండి పరకాల నియోజకవర్గ శాసనసభ్యునిగా పోటీచేసి.. ఇండిపెండెంట్ అభ్యర్థి బి. కైలాసంపై గెలిచారు. తరువాత అదే నియోజకవర్గం, అదే పార్టీ నుంచి 1972లో పోటీచేసి పింగళి ధర్మారెడ్డి చేతిలో ఓడిపోయారు. తరువాత 1978 ఎన్నికల్లో పరకాల అసెంబ్లీ నియోజకవర్గం S.C రిజర్వ్ కావడంతో ఇద్దరు కూడా శాయంపేట అసెంబ్లీ నియోజకవర్గం నుండి తలపడ్డారు. ఆ ఎన్నికల్లో మళ్ళీ పింగళి ధర్మారెడ్డిపై పోటీచేసి జంగారెడ్డి విజయం సాధించారు.
కాగా జంగారెడ్డి మరణం పట్ల ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సంతాపం తెలియజేశారు. చందుపట్ల కుమారుడు సత్యపాల్ రెడ్డికి ఫోన్ చేసిన కుటుంబ సభ్యులను పరామర్శించారు. పార్టీ ఆఫీస్ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడారు. తామందరికీ మార్గదర్శకుడైన జంగారెడ్డి మరణం బాధాకరమని..ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. జన సంఘ్ లో అత్యంత క్రియాశీల పాత్ర పోషించిన జంగారెడ్డిని నక్సల్స్ ఎన్నోసార్లు హతమారుస్తామని హెచ్చరించినా భయపడకుండా బీజేపీ బలోపేతం కోసం నిరంతరం పనిచేశారని కొనియాడారు బండి.
నిత్యం ప్రజల్లోనే ఉంటూ వారిసేవకు అంకితమైన గొప్ప నాయకుడని చెప్పారు. ఆయన చివర శ్వాస వరకు పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేశారని గుర్తు చేశారు. జంగారెడ్డి మరణం పార్టీకి తీరని లోటన్న సంజయ్… ఆయన ఆలోచనలను, ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు పాటు పడతామని తెలిపారు.
జంగారెడ్డి మృతి గురించి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో పార్టీ వ్యవస్థాపకుల్లో జంగారెడ్డి ఒకరని..రైతు కుటుంబంలో జన్మించి కష్టపడి పనిచేస్తూ పైకొచ్చిన నాయకుడని కొనియాడారు. పీవీ నర్సింహారావుపై ఎంపీగా విజయం సాధించిన నాయకుడని గుర్తు చేశారు. కేంద్రం తరఫున జంగారెడ్డి మృతి పట్ల ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
జంగారెడ్డి 1967లో శాయంపేట నుండి తొలిసారి జనతా పార్టీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తరువాత వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిపొందారు. 1984లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ తరఫున ఇద్దరు ఎంపీలు గెలిస్తే అందులో ఒకరు జంగారెడ్డి. ఆనాడు పీవీ నర్సింహారావుపై భారీ మెజారిటీతో గెలిచారు. ఆర్ఎస్ఎస్ లో క్రియాశీల పాత్ర పోషించారు.