Sunil Bansal : ఎన్నికల్లో పోటీ చేయకూడదు, అసెంబ్లీ ఇంచార్జ్‌లకు బీజేపీ పెద్దల షాక్

బీజేపీ తెలంగాణ అసెంబ్లీ ఇంచార్జ్ లకు ఊహించని షాక్ ఇచ్చారు రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి సునీల్ బన్సల్. అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇంచార్జ్ లుగా వ్యవహరిస్తున్న వారు ఎన్నికల్లో పోటీ చేసే వీలు లేదని చెప్పడంతో నేతలంతా కంగుతిన్నారు.

Sunil Bansal : ఎన్నికల్లో పోటీ చేయకూడదు, అసెంబ్లీ ఇంచార్జ్‌లకు బీజేపీ పెద్దల షాక్

Updated On : October 8, 2022 / 11:13 PM IST

Sunil Bansal : బీజేపీ తెలంగాణ అసెంబ్లీ ఇంచార్జ్ లకు ఊహించని షాక్ ఇచ్చారు రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి సునీల్ బన్సల్. అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇంచార్జ్ లుగా వ్యవహరిస్తున్న వారు ఎన్నికల్లో పోటీ చేసే వీలు లేదని చెప్పడంతో నేతలంతా కంగుతిన్నారు. పార్టీ నిర్ణయించిన అభ్యర్థులే పోటీలో ఉంటారని, పార్టీ గెలుపు కోసం పని చేయాలని చెప్పడంతో అసెంబ్లీ ఇంచార్జ్ లు అసంతృప్తి వ్యక్తం చేశారు.

 

తమను అసెంబ్లీ ఇంచార్జ్ పదవుల నుంచి తొలగించాలని కోరడంతో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ వెంటనే కలగజేసుకున్నారు. వారికి సర్ది చెప్పారు. మరో 6 నెలల పాటు పని చేయాలని సూచించారు. ఆ తర్వాత నియోజకవర్గాలపై ఫోకస్ చేసి తుది నిర్ణయం తీసుకుంటామని బండి సంజయ్ చెప్పడంతో వారు శాంతించారు. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో నియోజకవర్గ ఇంచార్జ్ లకు కష్టపడుతున్న తమను ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేయొద్దంటే, ఎలా అని ప్రశ్నిస్తున్నారు అసెంబ్లీ సెగ్మెంట్ ఇంచార్జ్ లు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

తెలంగాణ‌లోని 119 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఇంచార్జీల‌ను ప్ర‌క‌టిస్తూ బండి సంజ‌య్ శుక్ర‌వారం జాబితా విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జీలంటే… ఎన్నిక‌ల్లో దాదాపుగా వారే పార్టీ అభ్య‌ర్థులుగా బ‌రిలోకి దిగుతున్న సంగ‌తి తెలిసిందే. దాదాపుగా అన్ని పార్టీల్లోనూ అదే త‌ర‌హా సంప్ర‌దాయం కొనసాగుతోంది. ఈ క్రమంలో అసెంబ్లీ ఇంచార్జీలుగా ప‌ద‌వులు ద‌క్కిన బీజేపీ నేత‌లు ఎన్నికల్లో త‌మ‌కు టికెట్ ద‌క్కిన‌ట్టేన‌న్న భావ‌న‌తో సంబ‌రాల్లో మునిగిపోయారు.

అయితే అసెంబ్లీ నియోజ‌కవ‌ర్గాల ఇంచార్జీల జాబితా విడుద‌లైన మ‌రునాడే.. ఇంచార్జీలంద‌రికీ బీజేపీ తెలంగాణ ఇంచార్జీగా ఇటీవ‌లే ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన సునీల్ బ‌న్సల్ షాక్ ఇచ్చారు. అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జీలుగా ప‌ద‌వులు ద‌క్కిన వారు ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌వ‌ద్దంటూ ఆయ‌న ఓ సంచ‌ల‌న వ్యాఖ్య చేశారు. దీంతో షాక్‌కు గురైన ఇంచార్జీల్లో చాలా మంది త‌మ‌ను ప‌ద‌వుల నుంచి తొల‌గించాల‌ని బండి సంజయ్‌ను కోరారు.