CPM Tammineni Veerabharam : బీజేపీ వైభవం తాత్కాలికమే..త్వరలో కమ్యూనిస్టు పార్టీకి పూర్వవైభవం : తమ్మినేని వీరభద్రం
బీజేపీ వైభవం తాత్కాలికమేనని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. అయితే మళ్లీ కమ్యూనిస్టులకు పూర్వవైభవం వస్తుందని చెప్పారు. సీపీఐ రాష్ట్ర మహాసభల్లో ఆయన పాల్గొని, మాట్లాడారు.

CPM Tammineni Veerabharam
CPM Tammineni Veerabharam : బీజేపీ వైభవం తాత్కాలికమేనని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. అయితే మళ్లీ కమ్యూనిస్టులకు పూర్వవైభవం వస్తుందని చెప్పారు. సీపీఐ రాష్ట్ర మహాసభల్లో ఆయన పాల్గొని, మాట్లాడారు. ప్రజల్లో తమ సిద్ధాంతాల పట్ల ప్యాషన్ తగ్గిపోయిందని అన్నారు. కమ్యూనిస్టులకు ఈ దుస్థితి రావడానికి పార్టీలోని లోపం కూడా కారణమన్నారు.
రైతు వ్యతిరేక చట్టాల విషయంలో మోదీ క్షమాపణ చెప్పారని పేర్కొన్నారు. ఎన్డీఏ నుంచి నితీశ్ బయటకు రావడం మంచి పరిణామం అన్నారు. బీజేపీని ఓడించేందుకు ఏకాభిప్రాయం వచ్చిందని తమ్మినేని వీరభద్రం తెలిపారు. ఇటీవల కేసీఆర్‌తో భేటీలో రాజకీయ చర్చ వచ్చిందన్నారు. బీజేపీ వ్యతిరేక ఎజెండాపై కేసీఆర్‌ను ప్రశ్నించామని పేర్కొన్నారు.
బీజేపీ వ్యతిరేక ఎజెండా ఎంతవరకు వచ్చిందన్న తన వ్యాఖ్యలకు .. సీఎం కేసీఆర్ ఆసక్తికర సమాధానం ఇచ్చారన్నారు. కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. బీజేపీ వ్యతిరేక ఎజెండా కాదని .. ప్రజాస్వామ్య శక్తుల ఎజెండా అని కేసీఆర్ చెప్పారు.