ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా ఫలితం లేకపోవడంతో.. సొంత డబ్బులతో బ్రిడ్జ్ కట్టుకున్న రైతులు
గ్రామస్థుల కల నిజమైంది. వంతెన ప్రారంభంతో ఎన్నో సంవత్సరాల సమస్యకు పరిష్కారం లభించింది.

ప్రభుత్వానికి ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా ఫలితం లేకపోవడంతో జగిత్యాల జిల్లా, కోడిమ్యాల మండలంలోని బొల్లంచెరువు గ్రామ రైతులు స్వయంగా బ్రిడ్జ్ నిర్మించుకున్నారు. గ్రామానికి సమీపంలో ఉన్న కాలువను దాటి తమ పొలాలకు వెళ్లేందుకు రైతులు ఎన్నో కష్టాలు పడేవారు.
వర్షాకాలంలో అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. ట్రాక్టర్లు, ప్యాడీ హార్వెస్టింగ్ మెషీన్లు వెళ్లలేకపోవడం వల్ల పంట నష్టపోయేవారు. అధికారుల వద్ద ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా స్పందన లేకపోవడంతో రైతులు తమ సొంత డబ్బుతో వంతెన నిర్మాణం చేపట్టారు.
Also Read: మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌కు నోటీసులు ఇచ్చిన పోలీసులు
కాలువకు అటుపక్క ఉన్న భూముల రైతులు ఒక్కొక్కరు రూ.5,000 – రూ.10,000 చొప్పున విరాళంగా ఇచ్చారు. మొత్తం రూ.8.30 లక్షలు సేకరించి, ఆరు నెలల పాటు శ్రమించి వంతెన నిర్మాణం పూర్తి చేశారు. బుధవారం వంతెనను ప్రారంభించారు. గ్రామస్థుల కల నిజమైంది. వంతెన ప్రారంభంతో ఎన్నో సంవత్సరాల సమస్యకు పరిష్కారం లభించింది.