మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌కు నోటీసులు ఇచ్చిన పోలీసులు

ఈ నెల 26న కోవూరు పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు.

మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌కు నోటీసులు ఇచ్చిన పోలీసులు

MLA Anil Kumar Yadav

Updated On : July 24, 2025 / 9:46 AM IST

వైసీపీ నేత, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై అనిల్ కుమార్ యాదవ్ అనుచిత వ్యాఖ్యల చేశారని ఫిర్యాదు రావడంతో పోలీసులు ఈ మేరకు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ నెల 26న కోవూరు పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు.

Also Read: ఫ్లాట్ కొనాలనుకుంటున్నారా? తక్కువ ధరకే అమ్మకానికి రాజీవ్ స్వగృహ ఫ్లాట్లు

ఇవాళ ఉదయం పోలీసులు అనిల్ కుమార్‌కు నోటీసులు ఇచ్చేందుకు ఆయన ఇంటికి వెళ్లగా అక్కడ ఆయన అందుబాటులో లేకపోవడంతో ఇంటి గేటుకు నోటీసులు అంటించారు. కాగా, ప్రశాంతి రెడ్డిపై అనిల్ కుమార్ యాదవ్ చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని పలు పోలీస్‌ స్టేషన్లలో ఫిర్యాదులు అందాయి.