భూతవైద్యం పేరుతో బాలికపై అత్యాచారం, కడుపు నొప్పి రావడంతో బయటపడిన నిజం, దొంగ బాబాని చితక్కొట్టిన జనం

  • Published By: naveen ,Published On : October 13, 2020 / 01:16 PM IST
భూతవైద్యం పేరుతో బాలికపై అత్యాచారం, కడుపు నొప్పి రావడంతో బయటపడిన నిజం, దొంగ బాబాని చితక్కొట్టిన జనం

Updated On : October 13, 2020 / 1:35 PM IST

bootha vaidyudu: నిజామాబాద్ లో దారుణం జరిగింది. భూతవైద్యం పేరుతో భూతవైద్యుడు ఘోరానికి ఒడిగట్టాడు. బాలికపై అత్యాచారం చేశాడు. మూడు నెలలుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెబితే చంపేస్తానని బాలికను బెదిరించాడు. దీంతో బాలిక మౌనంగా ఉండిపోయింది. అయితే బాలికకు కడుపునొప్పి రావడంతో నిజం బయటపడింది.




బాలికను తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ జరిగిన ఘోరాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన బాలిక తల్లిదండ్రులు, బంధువులు భూతవైద్యుడ్ని చితకబాదారు. అతడిని చితక్కొట్టారు. దేహశుద్ధి చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.