Mahabubnagar : ఇది చిన్న పిల్లల బండి..పక్కకు తప్పుకో, పోలీసులకు చుక్కలు చూపించిన బుడ్డోడు

ఇది చిన్న పిల్లల బండి..పక్కకు తప్పుకో..నా దగ్గర కార్డు ఉంది..అంటూ ఓ బుడ్డోడు ట్రాఫిక్ పోలీసులకు చుక్కలు చూపించాడు. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. బుడ్డోడుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ గా మారింది.

Mahabubnagar : ఇది చిన్న పిల్లల బండి..పక్కకు తప్పుకో, పోలీసులకు చుక్కలు చూపించిన బుడ్డోడు

Bike

Updated On : August 5, 2021 / 8:31 PM IST

Boy Crazy Answers : ఇది చిన్న పిల్లల బండి..పక్కకు తప్పుకో..నా దగ్గర కార్డు ఉంది..అంటూ ఓ బుడ్డోడు ట్రాఫిక్ పోలీసులకు చుక్కలు చూపించాడు. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. బుడ్డోడుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ గా మారింది. మైనర్ పిల్లాడు బండి ఆపుతూ వెళుతుండగా ట్రాఫిక్ పోలీసు ఆపగా..బుడ్డోడు చెబుతున్న సమాధానం నెటిజన్లను నవ్వులు పూయిస్తోంది. చివరకు బుడ్డోడిని పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. అనంతరం ఈ విషయం పెద్దలకు తెలియచేసి..కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు.

Read More : Airtel : ఎయిర్‌టెల్‌ ఆఫీసు ఇంటర్నెట్ ప్లాన్

మహబూబ్ నగర్ జిల్లాలోని ఓ ప్రాంతంలో యదావిధిగా ట్రాఫిక్ పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో ఓ బండిపై ఓ మైనర్ పిల్లాడు వస్తున్న విషయం గమనించారు. ముఖానికి మాస్క్, హెల్మెట్ లేకపోవడంతో బాలుడిని ఆపారు. లైసెన్స్ లేకుండా పిల్లలు బండి నడపొద్దని తెలియదా ? అంటూ ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ ప్రశ్నించాడు.

Read More : Love Marriage : వివాహానికి అడ్డొచ్చిన కులం.. పెళ్లైన మూడు నెలలకే పరువు హత్య

తన దగ్గర గ్రీన్ కార్డు ఉందని, ఇది ఎలక్ట్రిక్ వాహనం అని..లైసెన్స్ అవసరం లేదని చెప్పుకొచ్చాడు. వెంటనే బండిని తీసుకుని పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. తల్లిదండ్రులను స్టేషన్ కు పిలిపించి..వారి సమక్షంలో మైనర్ బాలుడికి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇదంతా అక్కడనే ఉన్న కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయ్యింది.