Gachibowli : అప్పుడే నూరేళ్లు నిండాయా, రోలింగ్ షట్టర్‌‌లో చిక్కుకుని బాలుడు మృతి

హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో తీవ్ర విషాదం నెలకొంది. రోలింగ్ షట్టర్ లో ఇరుక్కుని బాలుడు చనిపోయాడు. దీంతో తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. షోరూం నిర్వాహకులు, భవన యజమాని నిర్లక్ష్యమే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు.

Tvs Showroom

Boy Dies : హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో తీవ్ర విషాదం నెలకొంది. రోలింగ్ షట్టర్ లో ఇరుక్కుని బాలుడు చనిపోయాడు. దీంతో తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. షోరూం నిర్వాహకులు, భవన యజమాని నిర్లక్ష్యమే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు.

Read More : IPCC: ముందుకొచ్చిన సముద్రం.. వైజాగ్, ముంబై మునిగిపోతాయా? ఐపీసీసీ రిపోర్ట్!

వివరాల్లోకి వెళితే…

గచ్చిబౌలిలోని అక్షయ్ నగర్ లో ఉన్న ఓ భవనంలో టీవీఎస్ షోరూమ్ (TVS Showroom) ఉంది. భవనంలో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన అర్జున్ వాచ్ మెన్ గా పనిచేస్తున్నాడు. షోరూంకు ఆటోమెటిక్ రోలింగ్ షట్టర్ ఉంది. 2021, ఆగస్టు 11వ తేదీ బుధవారం ఉదయం యదావిధిగా షట్టర్ తెరుస్తున్నారు. ఈ సమయంలో అర్జన్ కొడుకు రాజేష్ అక్కడనే ఉన్నాడు. ఆటోమెటిక్ షట్టర్ కు రాజేష్ చుట్టుకపోయాడు. కేకలు వేయడంతో అక్కడనే ఉన్న స్థానికులు..కిందకు దించారు. ఇరుక్కున్న రాజేష్ ను బయటకు తీశారు.

Read More : Medak : కారు డిక్కీలో డెడ్‌బాడీ కేసు..మిస్టరీ వీడింది, ఎందుకు చంపారంటే

షట్టర్ చుట్టుకపోవడంతో…తీవ్రంగా గాయపడిన రాజేష్.. అక్కడికక్కడనే మృతి చెందాడు. షోరూం నిర్వాహకులు, భవన యజమాని నిర్వాహకులే కారణమని ఆరోపిస్తున్నారు. వాచ్ మెన్ కుమార్తెకు కూడా..గతంలో విద్యుత్ షాక్ తగిలిందని, అప్పుడు సురక్షితంగా ఈమె బయటపడినట్లు తెలిసింది. పోలీసులు ఘటనా ప్రదేశానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలిస్తున్నారు. కొడుకు చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.