మేడిగడ్డ బ్యారేజ్ మరమ్మతు పనులకు బ్రేక్..!

మేడిగడ్డకు ఎగువ నుంచి 10వేల క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తోంది.

మేడిగడ్డ బ్యారేజ్ మరమ్మతు పనులకు బ్రేక్..!

Medigadda Barrage : మేడిగడ్డ బ్యారేజ్ మరమ్మతు పనులకు బ్రేక్ పడింది. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాణహితలో వరద ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. దీంతో మరమ్మతు పనులను నిలిపివేసిన అధికారులు.. మొత్తం 85 గేట్లకు గాను 84 గేట్లను తెరిచారు. మేడిగడ్డకు ఎగువ నుంచి 10వేల క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తోంది. వర్షా కాలం తర్వాతే బ్యారేజ్ మరమ్మతు పనులు పున: ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

ఎగువున భారీ వర్షాలు కురుస్తున్నాయి. మహారాష్ట్ర నుంచి వస్తున్న వరద నీరు.. ప్రాణహిత నదికి భారీగా చేరుకుంది. ప్రాణహితలో వరద ప్రవాహం పెరిగి.. ఆ వరద మేడిగడ్డ బ్యారేజీకి రావడంతో.. బ్యారేజీ మరమ్మతు పనులు కొనసాగించే పరిస్థితులు లేకుండా పోయాయి. ప్రస్తుతం తాత్కాలికంగా మరమ్మతు పనులకు బ్రేక్ పడింది. రోజురోజుకి వరద ప్రవాహం పెరుగుతోంది. ఈ కారణంగా.. ఎగువున, దిగువున పనులు నిర్వహించే పరిస్థితులు లేవు. అన్ని గేట్ల నుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది. దాంతో మరమ్మతులు ఇక కొనసాగించలేము అనే నిర్ధారణకు అధికారులు వచ్చారు.

ప్రస్తుతం యంత్రాలు అన్నింటిని బ్యారేజీ నుంచి బయటకు తీసుకొస్తున్నారు. బ్యారేజీలో 85 గేట్లు ఉండగా అందులో 84 గేట్లను పూర్తి స్థాయిలో లిఫ్ట్ చేశారు. 7వ బ్లాక్ లో 20వ గేటు మొరాయించడంతో గ్యాస్ కట్టర్ సాయంతో కట్ చేసి అందులోని భాగాలను విడదీశారు. 7వ బ్లాక్ లో ఉన్న అన్ని గేట్ల ద్వారా నీరు వెళ్లిపోయే విధంగా అధికారులు చర్యలు చేపట్టారు. రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రాణహిత నదితో పాటు గోదావరి పరివాహక ప్రాంతంలోనూ వర్షాలు కురుస్తుండటంతో రోజురోజుకి వరద ప్రవాహం పెరుగుతోంది. ప్రస్తుతానికి మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతు పనులకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్లైంది.

 

Also Read : బీఆర్ఎస్‌కు మరో బిగ్ షాక్, కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే