బీఆర్ఎస్‌కు మరో బిగ్ షాక్, కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే

ఇటీవలే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ కుమార్ లు కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే.

బీఆర్ఎస్‌కు మరో బిగ్ షాక్, కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే

Brs Mla Joins Congress : బీఆర్ఎస్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఆ పార్టీ నుంచి వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో ఆయన హస్తం గూటికి చేరారు. ఇటీవలే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ కుమార్ లు కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు బీఆర్ఎస్ నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరారు.

బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు వరుసగా కాంగ్రెస్ లో చేరుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటివరకు ఐదుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకోగా.. తాజాగా బీఆర్ఎస్ కు చెందిన చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య కాంగ్రెలో చేరిపోయారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో కాలె యాదయ్య కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

బీఆర్ఎస్ కు చెందిన మెజార్టీ ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకోవాలని కాంగ్రెస్ పట్టుదలగా ఉంది. బీఆర్ఎస్ శాసనసభా పక్షాన్ని కాంగ్రెస్ లో విలీనం చేసుకోవాలని చూస్తోంది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేరిక తర్వాత సీనియర్ నేత జీవన్ రెడ్డి తిరుగుబాటు నేపథ్యంలో.. చేరికల వేడి కాస్త తగ్గినట్లు అనిపించింది. అయితే, తాజాగా కాలె యాదయ్య ద్వారా మళ్లీ కాంగ్రెస్ లో చేరికల జోష్ నెలకొంది.

Also Read : లోకేశ్ రెడ్‌బుక్‌కు, కౌశిక్ రెడ్డి బ్లాక్ బుక్‌కు ఏమైనా సంబంధం ఉందా?