Telangana Congress : తుమ్మలకు పాలేరు, మైనంపల్లికి ఫ్యామిలీ ప్యాక్..! 17న కాంగ్రెస్‌లో చేరే బీఆర్ఎస్, బీజేపీ నేతలు వీరే..!

మైనంపల్లి హన్మంతరావు కు మల్కాజ్ గిరి టికెట్, మైనంపల్లి రోహిత్ రావు కు మెదక్ టికెట్ ఇచ్చేందుకు లైన్ క్లియర్ అయ్యింది. Telangana Congress Joinings

Telangana Congress Joinings

Telangana Congress Joinings : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు ఊపందుకోనున్నాయి. బీఆర్ఎస్, బీజేపీకి చెందిన పలువురు ముఖ్య నేతలు కండువా మార్చేసేందుకు సిద్ధమయ్యారు. వారంతా కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. సెప్టెంబర్ 17న హస్తం పార్టీ కండువా కప్పుకోనున్నారు. కాంగ్రెస్ లో చేరనున్న ఆ నాయకులకు అప్పుడే టికెట్లు కూడా కన్ ఫర్మ్ చేసినట్లు సమాచారం. ఇంతకీ కాంగ్రెస్ లో చేరనున్న బీఆర్ఎస్, బీజేపీ నాయకులు ఎవరెవరు? వారు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు?

మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు హస్తం గూటికి చేరనున్నారు. పాలేరు టికెట్ తుమ్మలకు ఇచ్చేందుకు కాంగ్రెస్ ఓకే చెప్పిందని తెలుస్తోంది. ఇక, బీఆర్ఎస్ మరో అసంతృప్త నేత, ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, ఆయన కొడుకు రోహిత్ రావు సైతం కాంగ్రెస్ లో చేరనున్నారు. వారిద్దరికీ టికెట్లు ఇచ్చేందుకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మైనంపల్లి హన్మంతరావు కు మల్కాజ్ గిరి టికెట్, మైనంపల్లి రోహిత్ రావు కు మెదక్ టికెట్ ఇచ్చేందుకు లైన్ క్లియర్ అయ్యింది.

Also Read..Azharuddin: జూబ్లీహిల్స్ టిక్కెట్ కోసం అజరుద్దీన్‌ గట్టి ప్రయత్నాలు.. విష్ణు పరిస్థితి ఏంటి?

మండవ వెంకటేశ్వరరావు కూడా కాంగ్రెస్ లో చేరనున్నారు. మండవకు నిజామాబాద్ రూరల్ టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ ఓకే చెప్పిందట. మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖా నాయక్ సైతం హస్తం గూటికి చేరనున్నారు. రేఖానాయక్ ఆసిఫాబాద్ నుంచి బరిలోకి దిగనున్నారు. ఇక, బీజేపీ మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరనున్నారు. ఆయన మహబూబ్ నగర్ నుంచి పోటీ చేయనున్నారు.

టీడీపీ మాజీ ఎమ్మెల్యే సీతా దయాకర్ రెడ్డి హస్తం కండువా కప్పుకోనున్నారు. సీతా దయాకర్ రెడ్డి కొడుకు కొత్త కోట సిద్దార్థ్ రెడ్డి మక్తల్ నుంచి బరిలోకి దిగనున్నారు. మరో బీజేపీ నేత జిట్టా బాలకృష్ణ రెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరనున్నారు. ఆయనకు భువనగిరి టికెట్ ఇవ్వనున్నారు. ఇక, ఏనుగు రవీందర్ రెడ్డి తోనూ కాంగ్రెస్ నేతలు చర్చలు జరుపుతున్నారు. రవీందర్ రెడ్డి ఎల్లారెడ్డి నుంచి పోటీ చేయనున్నారని సమాచారం.

Also Read..YS Sharmila: షర్మిల కన్నా తుమ్మలనే బెస్ట్ అప్షన్.. తెలంగాణ కాంగ్రెస్ లో మారిపోతున్న సమీకరణాలు!

ట్రెండింగ్ వార్తలు