కేటీఆర్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలకు తృటిలో తప్పిన ప్రమాదం

ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు ఉలిక్కిపడ్డారు. మరో వాహనంలో వారు వెళ్లారు.

కేటీఆర్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలకు తృటిలో తప్పిన ప్రమాదం

KTR

KTR: తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలకు తృటిలో ప్రమాదం తప్పింది. వారు మేడిగడ్డకు వెళ్తున్న బస్సు టైరు జనగామ జిల్లా నెల్లుట్ల బైపాస్ వద్ద పేలింది. దీంతో కేటీఆర్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు ఉలిక్కిపడ్డారు. మరో వాహనంలో వారు వెళ్లారు.

మరోవైపు, హనుమకొండ జిల్లాలోని హసన్‌పర్తి మండలం దేవన్నపేట దగ్గర బీఆర్ఎస్ నేతల కాన్వాయ్‌ని కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. హసన్‌పర్తి మండలం కాంగ్రెస్ అధ్యక్షుడు పోరెడ్డి మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ కార్యకర్తలు నిరసన తెలిపారు.

బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో కాన్వాయ్ దిగి కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు బీఆర్ఎస్ నేతలు. పరస్పరం నినాదాలతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల రంగప్రవేశంతో బీఆర్ఎస్ నాయకుల కాన్వాయ్ ముందుకు కదిలింది.

కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం అనవసర వ్యాఖ్యలు చేస్తోందని గులాబీ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రజలకు వాస్తవాలు చెప్పడానికి చలో మేడిగడ్డ చేపట్టామని అంటోంది.

Read Also: జై తెలంగాణ అంటే.. థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా: పోలీసులపై కేటీఆర్ పైర్