భట్టి విక్రమార్కకు జరిగిన అవమానంపై మల్లికార్జున్ ఖర్గే స్పందించాలి : బాల్క సుమన్

యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు అవమానం జరిగిందని.. ఈ అవమానాలులేని భారతం కోసమే బీఎస్పీ పోరాటం అని బీఎస్పీ రాష్ట్ర కన్వీనర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

Balka Suman : యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు అవమానం జరిగిందని, రెడ్డి నాయకుల దగ్గర ఒక ఎస్సీ బిడ్డను కింద కూర్చోబెట్టారని.. యావత్ దళిత జాతిని అవమానించారని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుడి దగ్గరే ఇంత అవమానం జరిగితే దళిత జాతి.. ఎక్కడ చెప్పుకోవాలి? ఎవరికి చెప్పుకోవాలి అంటూ బాల్క సుమన్ ప్రశ్నించారు. మరోవైపు.. రేవంత్ రెడ్డి సతీమణినిపైన కూర్చోబెట్టి బీసీ బిడ్డ అయిన కొండా సురేఖను కింద కూర్చోబెట్టారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడైన భట్టి విక్రమార్కనే అవమానించారు.. 74ఏళ్ల స్వాతంత్ర భారతంలో దళితులకు కాంగ్రెస్ పార్టీలో అవమానం జరుగుతుందని అన్నారు. ప్రభుత్వం వచ్చిన నాటినుంచి భట్టి విక్రమార్క ఫొటో పక్కన పెడుతున్నారు. ప్రభుత్వ యాడ్స్ లో భట్టి విక్రమార్క ఫొటోను పక్కన పెట్టారంటూ బాల్క సుమన్ విమర్శించారు.

Also Read : దేశ రక్షణ విషయంలో ఎక్కడా రాజీపడకుండా మోదీ సర్కారు ఏం చేస్తోందో తెలుసా?

భట్టి విక్రమార్కకు జరిగిన ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలి. భట్టికి జరిగిన అవమానంపై కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ స్పందించాలి. దళితుడైన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే భట్టికి జరిగిన అవమానంపై స్పందించాలని బాల్క సుమన్ డిమాండ్ చేశారు. గతంలో కుల సంఘం మీటింగ్ లో బీసీలు ఎస్సీలకు పాలన చేతకాదు అని రేవంత్ మాట్లాడారు.. కుల సంఘం మీటింగ్ లో చెప్పినట్టే రేవంత్ పాలనా ధోరణి ఉంది. భట్టికి జరిగిన అవమానకరపు ఘటనలు భవిష్యత్ లో జరగకుండా చూడాలని బాల్క సుమన్ కాంగ్రెస్ అధిష్టానంకు సూచించారు.

Also Read : ఆసక్తికరంగా క్రికెటర్ల పొలిటికల్ ఎంట్రీ.. చర్చనీయాంశంగా యూసుఫ్ పఠాన్ నియోజకవర్గం

యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు అవమానం జరిగిందని.. ఈ అవమానాలులేని భారతం కోసమే బీఎస్పీ పోరాటం అని బీఎస్పీ రాష్ట్ర కన్వీనర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పేర్కొన్నారు. ఈ ట్వీట్ లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పైన కూర్చోగా.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కింద కూర్చొని ఉన్న ఫొటోను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ షేర్ చేశారు.

 

ట్రెండింగ్ వార్తలు