KTR
KTR : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పుట్టిన రోజు ఇవాళ. ఈ సందర్భంగా పలువురు రాజకీయ, వ్యాపార, సినీ రంగాల ప్రముఖులు రేవంత్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు, మెగాస్టార్ చిరంజీవి సహా పలువురు ప్రముఖులు ట్విటర్ వేదికగా బర్త్ డే విషెస్ తెలిపారు. అయితే, మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ట్విటర్ వేదికగా రేవంత్ రెడ్డికి బర్త్ డే విషెస్ తెలిపారు. ఈ సందర్భంగా నేను హైదరాబాద్ లోనే ఉన్న.. వారు బర్త్ డే కేక్ కట్ చేస్తామంటే నేను ఇప్పిస్తా అంటూ కేటీఆర్ పోస్టులో పేర్కొన్నారు.
Also Read: సీఎం రేవంత్ రెడ్డి ‘మూసీ పునరుజ్జీవ సంకల్ప యాత్ర’.. పూర్తి షెడ్యూల్ ఇలా…
హైదరాబాద్ లో జరిగిన ఫార్ములా-ఈ కారు రేస్ వ్యవహారంలో ఒప్పందం కుదరడానికి ముందే నిధులు చెల్లించడం.. అందులోనూ నిబంధనలకు విరుద్ధంగా విదేశీ కరెన్సీ రూపంలో ఇవ్వడంపై విచారణ వేగవంతమైన నేపథ్యంలో గురువారం మంత్రి కేటీఆర్ స్పందించారు. జైలు కెళ్లేందుకైనా నేనే సిద్ధమే.. జైల్లో పెడితే యోగా చేసి పాదయాత్రకు సిద్ధపడతా.. అంటూ కామెంట్స్ చేశారు. అయితే, మలేషియా తెలంగాణ అసోసియేషన్ దశాబ్ది వేడుకల్లో పాల్గొనేందుకు కేటీఆర్ మలేషియా వెళ్లనున్నారు. ఈ క్రమంలో అరెస్టు భయంతో మలేషియాకు కేటీఆర్ వెళ్తున్నాడంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. దీనిపై తాజాగా బీఆర్ఎస్ నేత క్రిశాంక్ ట్వీట్ కు కేటీఆర్ స్పందిస్తూ.. రేవంత్ రెడ్డికి బర్త్ డే విషెస్ చెప్పారు.
Also Read: CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి బర్త్ డే విషెస్ చెప్పిన ప్రధాని నరేంద్ర మోదీ
కేటీఆర్ ట్వీట్ ప్రకారం.. రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు. నేను హైదరాబాద్ లోనే ఉన్న. మీ ఏసీబీ లాంటి ప్రభుత్వ ఏజెన్సీలను ఎప్పుడు పంపినా స్వాగతం పలుకుతా. వాళ్లకి చాయ్, ఉస్మానియా బిస్కెట్ తో పాటు, మీ బర్త్ డే కేక్ వారు కట్ చేస్తామంటే నేనే ఇప్పిస్తాను అంటూ.. అరెస్టు భయంతో మలేషియాకు అంటూ జరుగుతున్న ప్రచారంపై కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.
Happy Birthday @revanth_anumula
I am very much in Hyderabad. Your agencies are welcome anytime
Chai, Osmania biscuits and if they want to cut your birthday cake, it’s on me 👍 https://t.co/ccPOezg1WC
— KTR (@KTRBRS) November 8, 2024