BRS MLAs
BRS MLCs Resignation : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి విజయం సాధించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. శనివారం తమ రాజీనామాలను తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి అందజేశారు. ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేసిన వారిలో పల్లా రాజేశ్వర్ రెడ్డి, కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డిలు ఉన్నారు. తెలంగాణ అసెంబ్లీ 2023 ఎన్నికలు కంటేముందు వీరు ఎమ్మెల్సీలుగా కొనసాగుతూ వచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ వీరికి టికెట్లు కేటాయించడంతో పోటీచేసి విజయం సాధించారు.
Also Read : Jeevan Reddy : రాజకీయాలకు అతీతంగా ఆరు గ్యారంటీలు అమలు చేస్తాం : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
పల్లా రాజేశ్వరరెడ్డి జనగామ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అంతకుముందు పల్లా ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల గ్రాడ్యుయేట్ కోటాలో ఎమ్మెల్సీగా పల్లా రాజేశ్వరరెడ్డి విజయం సాధించారు. ప్రస్తుతం ఆయన రాజీనామాతో ఆ స్థానం ఖాళీ అయింది. మరో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి హుజారాబాద్ నియోజకవర్గం నుంచి ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పై విజయం సాధించారు. దీంతో ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి శాసన సభ్యుడి హోదాలో అసెంబ్లీలో అడుగుపెట్టారు.
కడియం శ్రీహరి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా కడియం శ్రీహరి పోటీచేసి విజయం సాధించారు. దీంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ఎమ్మెల్యే హోదాలో కడియం అసెంబ్లీకి వెళ్లారు.
https://twitter.com/PRR_BRS/status/1733385546666590253
https://twitter.com/KaushikReddyBRS/status/1733362646009704590