Telangana BJP : అసెంబ్లీలో ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని బహిష్కరించిన బీజేపీ.. ప్రభుత్వంపై కిషన్ రెడ్డి విమర్శలు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని బీజేపీ ఎమ్మెల్యేలు బహిష్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రొటెం స్పీకర్ గా సీనియర్ సభ్యులను మాత్రమే నియమించాలని..

Telangana BJP : అసెంబ్లీలో ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని బహిష్కరించిన బీజేపీ.. ప్రభుత్వంపై కిషన్ రెడ్డి విమర్శలు

BJP MLAs

Telangana Assembly : కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. సీఎంగా రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్కతోపాటు 10 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. నేటినుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే, తొలిరోజే బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించారు. అక్బరుద్దీన్ ఎదుట ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేసేందుకు వారు నిరాకరించారు.

Also Read : Vijayashanti : కేసీఆర్ హైదరాబాద్‌లో ఉండాల్సిన అవసరం ఏమిటి?: విజయశాంతి

నూతనంగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలతో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శనివారం భేటీ అయ్యారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యేలను కిషన్ రెడ్డి సన్మానించారు. అంతకుముందు భాగ్యలక్ష్మీ అమ్మవారికి కిషన్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యేలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జరిగిన సమావేశంలో అసెంబ్లీ సమావేశాల్లో లేవనెత్తాల్సిన ప్రజా సమస్యలపై చర్చించారు. ఈ సమావేశంలో ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ సమక్షంలో అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేసే అంశంపై చర్చకు వచ్చింది. అక్బరుద్దీన్ ప్రొటెం స్పీకర్ అయితే ప్రమాణ స్వీకారం చేయమని బీజేపీ ఎమ్మెల్యే పేర్కొన్నారు. దీంతో అసెంబ్లీ సమావేశాల్లోభాగంగా ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు తెలిపారు.

Also Read : Telangana Cabinet : తెలంగాణలో మంత్రులకు శాఖల కేటాయింపు.. ఎవరెవరికి ఏశాఖ దక్కిందంటే?

ఈ విషయంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని బీజేపీ ఎమ్మెల్యేలు బహిష్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రొటెం స్పీకర్ గా సీనియర్ సభ్యులను మాత్రమే నియమించాలని, అక్బరుద్దీన్ ను ప్రొటెం స్పీకర్ గా నియమించి కాంగ్రెస్ ప్రభుత్వం సంప్రదాయాలను కాలరాసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలకు లోపాయికారీ ఒప్పందం ఉందని ఆరోపించారు. సీనియర్ సభ్యుడి ఆధ్వర్యంలో రెగ్యులర్ స్పీకర్ ను ఎన్నుకోవాల్సి ఉందని, స్పీకర్ ఎన్నికను నిలిపివేయాలని గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేస్తామని కిషన్ రెడ్డి అన్నారు. మజ్లిస్ పార్టీతో ఒప్పందం మేరకే అక్బరుద్దీన్ ను ప్రొటెం స్పీకర్ చేశారు. తుమ్మినా.. దగ్గినా కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని కిషన్ రెడ్డి అన్నారు. ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకే కాంగ్రెస్ మజ్లిస్ తో అంటకాగుతోందని కిషన్ ఆరోపించారు.