Kaushik Reddy Video: 10 టీవీ ఆఫీసు వద్ద బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్ట్

హైదరాబాద్‌ జూబ్లిహిల్స్‌లోని 10టీవీ ఆఫీసులో కౌశిక్ రెడ్డి ఇంటర్వ్యూ ఇచ్చి బయటకు వెళ్తున్న సమయంలో ఆయనను పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లారు.

Kaushik Reddy Video: 10 టీవీ ఆఫీసు వద్ద బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్ట్

MLA Koushik Reddy

Updated On : January 13, 2025 / 8:30 PM IST

బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌ జూబ్లిహిల్స్‌లోని 10టీవీ ఆఫీసులో కౌశిక్ రెడ్డి ఇంటర్వ్యూ ఇచ్చి బయటకు వెళ్తున్న సమయంలో ఆయనను కరీంనగర్‌ పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లారు. కౌశిక్‌రెడ్డిని పోలీసులు కరీంనగర్‌కు తరలించారు.

ఆదివారం కరీంనగర్‌ కలెక్టరేట్‌లో నిర్వహించిన ఓ సమావేశంలో పాల్గొన్న కౌశిక్‌ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ గొడవపడ్డ విషయం తెలిసిందే. సంజయ్‌ను ఉద్దేశించి కౌశిక్‌రెడ్డి చేసిన కామెంట్ల వల్ల వాగ్వాదం చోటు చేసుకుంది. తెలంగాణ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి సమక్షంలోనే ఈ గొడవ జరిగింది.

అనంతరం.. కౌశిక్‌రెడ్డిపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌కు సంజయ్‌ ఫిర్యాదు చేశారు. తనపై కౌశిక్‌రెడ్డి దుర్భాషలాడారని సంజయ్‌ చెప్పారు. తాను ప్రజా సమస్యలపై మాట్లాడుతున్న సమయంలో కౌశిక్‌ రెడ్డి అడ్డుకున్నారని తెలిపారు. కౌశిక్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలన్నారు.

కౌశిక్ రెడ్డి చేసిన కామెంట్లపై కాంగ్రెస్ పార్టీ నేతలు కరీంనగర్‌ త్రీ టౌన్‌ పీఎస్‌లోనూ ఫిర్యాదు చేశారు. గేమ్‌ ఛేంజర్‌ టికెట్ల ధరలను పెంచడంతో సీఎం రేవంత్‌ రెడ్డిపై కౌశిక్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలలు చేశారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ కమ్యూనిటీలోని ప్రతి జంట నలుగురు పిల్లల్ని కనాలి.. రూ.లక్ష చొప్పున ఇస్తాం: మధ్యప్రదేశ్‌ బ్రాహ్మిన్‌ బోర్డ్‌ చీఫ్