BRS MLA Kotha Prabhakar Reddy (Image Credit To Original Source)
BRS MLA Kotha Prabhakar Reddy : దుర్గం చెరువు కబ్జా అనేది పూర్తిగా నిరాధారం.. నాపై కక్షతో పెట్టిన కేసు అది.. అక్కడ నాకు భూమి లేదు.. నటుడు నందమూరి బాలకృష్ణ, లహరి ఎస్టేట్ హరిబాబు భూములు పక్కనే ఉన్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు.
Also Read : Kavitha : నా రక్తం మరిగిపోతుంది.. సీఎం రేవంత్, హరీశ్ రావులపై కవిత సంచలన కామెంట్స్..
దుర్గం చెరువు ఆక్రమణపై హైడ్రా ఫిర్యాదుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఆయన సోదరుడు వెంకట్ రెడ్డిపై శుక్రవారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో మాధాపూర్ పోలీసులు భూ ఆక్రమణపై దర్యాప్తు చేపట్టారు. కొత్త ప్రభాకర్ రెడ్డి, ఆయన సోదరుడు దుర్గం చెరువులో సుమారు ఐదు ఎకరాల భూమిని అక్రమంగా ఆక్రమించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆక్రమించిన ఐదు ఎకరాల భూమిని ఎస్‌టీఎస్ ప్రైవేటు ట్రాన్స్‌పోర్టు పార్కింగ్‌కు వినియోగిస్తున్నట్టు హైడ్రా అధికారులు ఫిర్యాదులో పేర్కొన్నారు. తాజాగా ఈ వ్యవహారంపై ప్రభాకర్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడుతూ.. దుర్గం చెరువు కబ్జా అంటూ నాపై వచ్చిన ఆరోపణలు నిరాధారం అంటూ పేర్కొన్నారు.
హైకోర్టులో యాక్షన్ పెడితే రెండెకరాలు కొన్నాం. అయితే, తరువాత చెల్లదని టీడీఆర్ ఇచ్చారు. తరువాత దుర్గం చెరువు నిర్మాణం జరిగిందని కొత్త ప్రభాకర్ రెడ్డి తెలిపారు. నటుడు నందమూరి బాలకృష్ణ, లహరి ఎస్టేట్ హరిబాబు భూములు పక్కనే ఉన్నాయి. ప్రైవేట్ పార్కింగ్ పెట్టినందుకు నాపై కేసు పెట్టారు. దుర్గం చెరువులో నాకు భూమి లేదు.. భూమి కబ్జా చేసినట్లు ప్రభుత్వం నిరూపిస్తే దేనికైనా సిద్ధమని ప్రభాకర్ రెడ్డి అన్నారు.
ఎవ్వరూ పర్సనల్ ఫిర్యాదు చెయ్యలేదు.. ఫిర్యాదులో హైడ్రా మాత్రమే కనిపిస్తోంది. కేసు సమాచారం మా సిబ్బందికి పోలీసులు చెప్పారు. కేసుపై లీగల్ ఫైట్ చేస్తాం. పోలీస్ స్టేషన్‌కు వెళ్తాను.. పోలీసులకు సహకరిస్తానని ప్రభాకర్ రెడ్డి చెప్పారు. అక్కడ వెహికిల్ పార్కింగ్ చేయడం సహజం. బేషరతుగా కేసు విత్ డ్రా చేయకపోతే ఎఫ్టీఎల్‌లో ఇండ్లు కట్టారు… ఆ ఇండ్ల ముందు ధర్నా చేస్తానని ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.