Kavitha : నా రక్తం మరిగిపోతుంది.. సీఎం రేవంత్, హరీశ్ రావులపై కవిత సంచలన కామెంట్స్..
Kalvakuntla Kavitha : సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావుపై జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.
Kalvakuntla Kavitha
- కేసీఆర్‌పై రేవంత్ వ్యాఖ్యల పట్ల కవిత ఆగ్రహం
- పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలపై సిట్ ఏర్పాటుచేస్తే నేను వచ్చి వివరాలు ఇస్తా
- మళ్ళీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా హరీశ్‌కు అవకాశం సరికాదు
- కేసీఆర్ అసెంబ్లీకి రావాలి
Kalvakuntla Kavitha : సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావుపై జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. కేసీఆర్ ను తిడుతుంటే కూతురిగా నా రక్తం ఉండుకుతుంది. రేవంత్ రెడ్డి కేసీఆర్ ను కసబ్ తో పోల్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్న. ఉద్యమ నాయకుడైన కేసీఆర్ పై రేవంత్ రెడ్డి అలా మాట్లాడితే నా రక్తం మరిగిపోతుందని కవిత అన్నారు. ముఖ్యమంత్రి చాంబర్ కు పోయి హరీష్ రావు అర్థగంట మాట్లాడుకుంది నిజం కాదా? అని కవిత ప్రశ్నించారు.
కవిత శుక్రవారం మండలికి వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడారు. నాలుగు నెలల్లో అనేక రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. నా రాజీనామాను ఆమోదించాలని చైర్మన్‌ను కోరడానికి మండలికి వచ్చా. ఫ్లోర్‌లో మాట్లాడే ఛాన్స్ ఇవ్వాలని చైర్మన్‌ను కలిసి కోరుతానని కవిత అన్నారు.
కేసీఆర్ పై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు సరికాదు. కేసీఆర్‌ను ఊరి వేయడం కాదు.. రేవంత్ రెడ్డినే రెండు సార్లు ఊరి వేయాలి. బీఆర్ఎస్ పాలమూరు-రంగారెడ్డి పాయింట్ మార్చడం చారిత్రాత్మక తప్పిదం. మాజీ మంత్రి హరీశ్ రావు స్వయంగా తప్పిదం చేశారు. ప్యాకేజీల కోసం హరీష్ ప్రయత్నం చేశారని కవిత ఆరోపించారు. పాలమూరు రంగారెడ్డి విషయంలో రేవంత్ రెడ్డి కూడా బీఆర్ఎస్ చేసిన తప్పే చేస్తున్నారు. పాలమూరు – రంగారెడ్డి పాయింట్ జూరాలకు ఎందుకు మార్చడం లేదని కవిత ప్రశ్నించారు. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్‌పై సిట్ ఏర్పాటు చేస్తే నేను వచ్చి వివరాలు ఇస్తానని కవిత అన్నారు.
కేసీఆర్ అసెంబ్లీకి వస్తే బాగుంటుంది. రానున్నరోజుల్లో బీఆర్ఎస్ పార్టీ గడ్డు పరిస్థితిని ఎదురుకుంటుంది. పిల్ల కాకుల మీద అసెంబ్లీ వదిలివేయడం కాదు.. కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని కాపాడుకోవాలి. బీఆర్ఎస్ మనుగడ సాగించాలంటే కేసీఆర్ అసెంబ్లీకి రావాలని కవిత అన్నారు.
ప్యాకేజీలకోసం పాకులాడే డబుల్ షూటర్‌కి అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అవకాశం ఇచ్చారు. మోసం చేసిన వ్యక్తికి మళ్ళీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా అవకాశం ఇవ్వడం పార్టీ చేసిన తప్పిదం. రానున్న రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో తెలంగాణ జాగృతి ప్రత్యామ్నాయంగా మారుతుందని కవిత అన్నారు.
బ్లేమ్ గేమ్‌తో రెండు పార్టీలు ప్రజలను మోసం చేస్తున్నాయి. నీటి సమస్య చాలా సెన్సిటివ్ ఇష్యూ. నీటి సమస్యపై కేసీఆర్ మాట్లాడితేనే ప్రజల్లోకి వెళ్తుంది. అసెంబ్లీకి వచ్చి పాలమూరు – రంగారెడ్డిపై కేసీఆర్ ఏదొకటి చెప్పాలి. చంద్రబాబుసైతం ముఖ్యమంత్రి అయ్యాకనే అసెంబ్లీకి వస్తానని శఫథం చేసి వెళ్లాడు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే.. కేసీఆర్‌ను ఎదుర్కొనే పరిస్థితి ఎవరికీ ఉండదని కవిత అన్నారు.
మాజీ మంత్రి హరీశ్ రావుకు ముఖ్యమంత్రితో మ్యాచ్ ఫిక్సింగ్ ఉందని కవిత ఆరోపించారు. ముఖ్యమంత్రి చాంబర్‌కుపోయి హరీష్ రావు అర్థగంట మాట్లాడుకుంది నిజం కాదా..? అని కవిత ప్రశ్నించారు. కేసీఆర్ మీద ముఖ్యమంత్రిది దారుణమైన భాష. ముఖ్యమంత్రి రేవంత్‌ను వంద సార్లు.. రాళ్లతో కొట్టి చంపాలని కవిత తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కోమటిరెడ్డి బ్రదర్స్ కన్ఫ్యూజన్ లో ఉన్నారని కవిత వ్యాఖ్యానించారు.
