KTR : ఇది తాత్కాలిక స్పీడ్ బ్రేకర్ మాత్రమే, ప్రజలు నా విశ్వాసాన్ని నిలబెట్టారు- కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

అయ్యో కేసీఆర్ ప్రభుత్వం పోయిందా? అంటూ కాంగ్రెస్ కు ఓటు వేసిన వారు కూడా మెసేజ్ లు పెడుతున్నారు అని కేటీఆర్ చెప్పారు.

KTR On Election Results (Photo : Google)

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు మాజీమంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్. ఎన్నికల్లో అనుకోని ఫలితాలు రావడం కామన్ అని చెప్పారు. ఓటమిపాలైనంత మాత్రాన నిరాశ పడాల్సిన అవసరం లేదన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి నివాళి అర్పించారు ఎమ్మెల్యే కేటీఆర్. ఎన్ని ప్రలోభాలు పెట్టినా, కుట్రలు చేసినా ప్రజలు మాత్రం అభివృద్ధికి, సంక్షేమానికే పట్టం కట్టారని కేటీఆర్ అన్నారు.

పోరాటాల నుంచి వచ్చిన పార్టీ మాది, పోరాటాలు మాకేం కొత్త కాదన్నారు కేటీఆర్. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం ప్రజల పక్షాన మాట్లాడతామన్నారు. అయ్యో కేసీఆర్ ప్రభుత్వం పోయిందా? అంటూ కాంగ్రెస్ కు ఓటు వేసిన వారు కూడా మెసేజ్ లు పెడుతున్నారు అని కేటీఆర్ చెప్పారు. పవర్ పాలిటిక్స్ లో అధికారం రావడం పోవడం సహజం అన్న కేటీఆర్.. అధికారం పోయినంత మాత్రాన నిరాశ పడాల్సిన అవసరం లేదన్నారు. ప్రజలు ఇచ్చిన ప్రతిపక్ష పాత్రలో కూడా రాణిస్తామని, ప్రజల గొంతుకై మాట్లాడతామని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

Also Read : దివ్యాంగురాలికి ఇచ్చిన మాట నిలబెట్టుకోనున్న రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ ప్రభుత్వంలో తొలి ఉద్యోగం ఆమెకే..

తెలంగాణకు ఉన్న ఏకైక గొంతు కేసీఆర్, బీఆర్ఎస్ అన్న కేటీఆర్.. ప్రజలు వదులుకోరు అని నమ్మకం వ్యక్తం చేశారు. ఇది తాత్కాలిక స్పీడ్ బ్రేకర్ మాత్రమే అని, ఇది స్వల్ప కాలం మాత్రమే అని కేటీఆర్ పేర్కొన్నారు. సిరిసిల్లలో ఓటుకు డబ్బులు, మందు పంచనని మాట ఇచ్చాను, ఆ మాటను నిలబెట్టుకున్నాను. ప్రజలు కూడా నా విశ్వాసాన్ని నిలబెట్టారు అని కేటీఆర్ అన్నారు.

Also Read : కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది ఆర్నెళ్లే.. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

ట్రెండింగ్ వార్తలు