వాళ్లపై ఎందుకింత కక్ష..? సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖ

చేనేత మిత్రా వంటి పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం పక్కన పెట్టిందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో చేనేతలకు అందుతున్న ...

MLA KTR

KTR : సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. నేతన్నలపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష కట్టిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేతన్నలపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకింత కక్ష అంటూ రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. వారు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఆదుకోరా? కార్మికులు రోడ్డున పడ్డా కనికరించరా అంటూ కేటీఆర్ ప్రశ్నించారు.

Also Read : జూన్ 6న రాహుల్ ప్రధానిగా ప్రమాణం చేయబోతున్నారనడానికి ఈ సభ సాక్ష్యంగా నిలవాలి: పొంగులేటి

పదేళ్ల తరువాత సమైక్యరాష్ట్రం నాటి సంక్షోభం.. ప్రస్తుతం కాంగ్రెస్ హయాంలో వారు ఎదుర్కొంటున్నారు. నేతన్నల బతుకులు ఆగం అయ్యేలా కాంగ్రెస్ విధానాలు ఉన్నాయి. నేతన్నలకు అర్డర్లు అపేసిన కాంగ్రెస్ ప్రభుత్వం వారిని ఏం చేయాలని అనుకుంటుందో చెప్పాలంటూ రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. గతంలో మాదిరే నేతన్నలకు చేతినిండా అర్డర్లు వేంటనే ఇవ్వాలి, బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇవ్వడంతోపాటు ఎన్నికల కోడ్ వల్ల ఆపిన పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని రేవంత్  రెడ్డిని కేటీఆర్ డిమాండ్ చేశారు.

Also Read : Peddapalli Lok Sabha Constituency : పెద్దపల్లిలో బస్తీమే సవాల్‌.. ఈ ముగ్గురిలో విక్టరీ కొట్టేదెవరు?

చేనేత మిత్రా వంటి పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం పక్కన పెట్టిందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో చేనేతలకు అందుతున్న అన్ని పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అమలు చేయాలని, అవసరం అయితే మరింత సాయం చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని  కోరారు. కేవలం గత ప్రభుత్వంపై కోపంతో నేతన్నల పొట్ట కొట్టడం సరైంది కాదన్నారు. రైతన్న మాదిరే, నేతన్నలు ఆత్మహత్యలు చేసుకోవడం అత్యంత బాధకరమని, వస్త్ర పరిశ్రమను ఆదుకోకపోతే కాంగ్రెస్ భారీ మూల్యం చెల్లించక తప్పదని రేవంత్ రెడ్డికి రాసిన లేఖలో కేటీఆర్ హెచ్చరించారు.