పోలీసులపైనా కంప్లైంట్ చేయొచ్చు

పరిష్కారం దొరికింది. నిబంధనలను విరుద్ధంగా వ్యవహరించిన పోలీసు అధికారులు, ప్రజలను ఇబ్బందులు పెట్టే ఖాకీలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం సింపుల్.

పరిష్కారం దొరికింది. నిబంధనలను విరుద్ధంగా వ్యవహరించిన పోలీసు అధికారులు, ప్రజలను ఇబ్బందులు పెట్టే ఖాకీలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం సింపుల్.

సమజాంలో ఏ అన్యాయం జరిగినా.. ఏ ఆపద ముంచుకొచ్చినా ముందుగా గుర్తొచ్చేది పోలీస్ స్టేషన్. రక్షక భటులు మీద అంత నమ్మకం. కొన్ని పరిస్థితుల్లో ఆ పోలీసుపైనే నమ్మకం కోల్పోతే.. ఇబ్బందులకు గురి చేస్తే.. ఉన్నతాధికారులకు తప్పనిసరిగా కంప్లైంట్ చేయాలనుకుంటాం. దానికి చాలా సమయంతో పాటు ఎంతోమందిని దాటుకుంటూ పోవాలి. వీటన్నిటికీ పరిష్కారం దొరికింది. నిబంధనలను విరుద్ధంగా వ్యవహరించిన పోలీసు అధికారులు, ప్రజలను ఇబ్బందులు పెట్టే ఖాకీలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం సింపుల్. మీ స్మార్ట్ ఫోన్ లో హ్యాక్ ఐ యాప్(డేగ కన్ను) ఉంటే చాలు. 

ప్రజలను ఇబ్బందులకు గురిచేసే పోలీసులపై ఫిర్యాదులకు పరిష్కారం చూపాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. అందులో భాగంగా పోలీసు శాఖలో పూర్తి పారదర్శకత కోసం ‘హ్యాక్ ఐ’లో కొత్త ఫీచర్ అందుబాటులోకి తెచ్చారు. చాలా రోజుల క్రితమే ఈ యాప్ ఉన్నప్పటికీ నూతనంగా వయొలేషనల్ బై పోలీస్.. అనే ఆఫ్షన్‌ను పొందుపరిచారు. ప్రజల నుంచి ఫిర్యాదు తీసుకోకపోయినా, ఎఫ్ఐఆర్ నమోదు తిరస్కరించినా, దురుసుగా ప్రవర్తించినా, ప్రతిఫలితం ఆశించినా అసభ్యంగా ప్రవర్తించినా ఏకపక్షంగా వ్యవహరించినా సరిగా స్పందించకున్నా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘనలు.. తదితర విషయాలపై నేరుగా కంప్లైంట్ చేసేయొచ్చు. 

ఎక్కడ జరిగిందో చెబుతూ ఫొటోలు, వీడియోలు సహా అధికారులకు వివరంగా కంప్లైంట్ చేయొచ్చు. నేరుగా ఉన్నతాధికారులకే చేరుతుంది కాబట్టి.. నిమిషాల్లో బాధితుల సమస్యకు పరిష్కారం దొరికినట్లే. అదే సమయంలో తప్పుడు ప్రచారాలకు తెరపడుతుందని పోలీస్ ఉన్నతాధికారులు వెల్లడించారు.