Car Falls Into Well Representative Image (Image Credit To Original Source)
Manakondur: కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం వెగురుపల్లి గ్రామంలో ఓ కారు బావిలో కనపడింది. దాదాపు 14 గంటలపాటు శ్రమించి బావిలోని కారులో నుంచి పోలీసులు మృతదేహాన్ని బయటకు తీశారు.
ఆ మృతదేహం ఊటూరు గ్రామానికి చెందిన రాజుదిగా పోలీసులు గుర్తించారు. కారులోనే మృతదేహం కుళ్లిపోయింది. ఆ మృతదేహానికి పోస్ట్‌మార్టం చేశాక, బంధువులకు అప్పగించనున్నారు.
Also Read: పండగపూట మందుబాబులకు షాక్.. మద్యం బాటిళ్ల ధరలు పెరిగాయ్
రాజుది హత్యనా? ఆత్మహత్యనా? ప్రమాదవశాత్తూ ఆ కారు బావిలో పడిందా? ఆనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గతంలో రాజు తండ్రి నాగయ్య అనుమానాస్పద మృతి చెందాడు. ఇప్పుడు రాజు మృతిపై కూడా సందేహాలు వ్యక్తమవుతున్నాయి.