Casino Chikoti praveen : క్యాసినో చికోటి ప్రవీణ్‌ కేసు..మాధవరెడ్డి కారుపై మంత్రి మల్లారెడ్డి స్టిక్కర్..!

క్యాసినో నిర్వహాకుడు చికోటి ప్రవీణ్‌ యవ్వారం తెలంగాణలో హాట్‌ టాపిక్‌గా మారింది.విచారణల్లో కొత్త కొత్త విషయాలు బయటపడుతున్నాయి. ప్రవీణ్ పార్టనర్ మాధవరెడ్డి కారుపై మంత్రి మల్లారెడ్డి స్టిక్కర ఉండటం ఆసక్తికరంగా మారింది.

Minister Mallareddy : క్యాసినో నిర్వహాకుడు చికోటి ప్రవీణ్‌ యవ్వారం తెలంగాణలో హాట్‌ టాపిక్‌గా మారింది.విచారణల్లో కొత్త కొత్త విషయాలు బయటపడుతున్నాయి. చికోటి ప్రవీణ్ కు రాజకీయ పలుకుబడికూడా బాగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే విచారణకు రావాలని ఈడీ నోటీసుల్ని కూడా ఇటువంటివి వెరీ కామన్ అంటూ లైట్ తీసుకున్నారు చికోటి ప్రవీణ్. ప్రవీణ్ ఇంట్లో ఈడీ సోదాలపై ఆయన స్పందించారు. ఈడీ అధికారులు మా ఇంట్లో సోదాలు చేశారు కానీ ఏమీ సీజ్ చేయలేదని తెలిపిన ప్రవీణ్ విచారణకు రావాలని అధికారులు అన్నారని ఈడీ నోటీసులకు సమాధానం చెబుతా అంటూ నిర్లక్ష్యంగా సమాధానమించారు చికోటీ ప్రవీణ్.

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ).. ప్రవీణ్‌పై కేసులు నమోదుచేసి బుధవారం (జులై 27,2022) హైదరాబాద్ లోని 8 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. రూ.కోట్ల హవాలా ద్వారా ఫెమా నిబంధనలు ఉల్లంఘించినట్టు ఈడీ ఆధారాలు సేకరించింది. ఇదిలా ఉంటే క్యాసినో నిర్వహిస్తూ..ఒంటిమీద కిలోల కొద్దీ బంగారంతో హెలికాఫ్టర్ లో తిరుగుతూ వెరీ రిచ్ లైఫ్ లీడ్ చేస్తున్న చికోటీ ప్రవీణ్ వ్యవహారంలో ఆసక్తికర విషయాలు వెల్లడి అవుతున్నాయి.

Also read : Casino Chikoti Praveen : చికోటి ప్రవీణ్ తో వైసీపీ నేతలకు సంబంధాలు..నేపాల్ వెళ్లినవారిలో సగంమంది వారే

బోయినపల్లికి చెందిన చికోటీ ప్రవీణ్ పార్టనర్..మెదక్ డీసీసీబి చైర్మన్ చిట్టి మాధవరెడ్డి ఇంట్లో కూడా ఈడీ సోదాలు నిర్వహించింది. కీలక డాక్యుమెంట్లు, క్యాసినోలతో చేసుకున్న ఒప్పందాలు, హవాలా మార్గంలో తెచ్చిన నగదుకు సంబంధించి ఆధారాలను ఈడీ స్వాధీనం చేసుకుంది. ఈక్రమంలో మాధవరెడ్డి ఇంట్లో ఉన్న ఓ కారుపై తెలంగాణ మంత్రి మల్లారెడ్డి పేరుతో ఉన్న స్టిక్కర్‌ కనిపించడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. మల్లారెడ్డికి దీంట్లో సంబంధముందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

దీంతో..కారు స్టిక్కర్‌పై మంత్రి మల్లారెడ్డి తనదైన శైలిలో స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ.. కారుపై ఉన్న ఎమ్మెల్యే స్టిక్కర్‌ నాదేనని..కానీ ఆ స్టిక్కర్ 2022 మార్చినాటిదని..మూడు నెలల క్రితమే నేను వాడి పారేశానని స్పష్టంచేశారు. తానే పడేసిన స్టిక్కర్‌ను ఎవరో పెట్టుకుంటే నాకేంటి సంబంధం? అని మంత్రి ప్రశ్నించారు.

కాగా..క్యాసినో వ్యవహారంలో చికోటి ప్రవీణ్‌, మాధవరెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. సోమవారం ఈడీ ఎదుట హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. హవాలా లావాదేవీలపై ఈడీ.. ప్రవీణ్‌ను ప్రశ్నించనున్నట్టు తెలుస్తోంది. సోదాల్లో ఈడీ.. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు నుంచి పెద్ద సంఖ్యలో వ్యక్తులను వీరు ప్రత్యేక విమానాల్లో తరలించి అక్కడ క్యాసినో నిర్వహించినట్టు ఆధారాలు సేకరించింది.

Also read : asino Chikoti Praveen : చికోటి ప్రవీణ్‌..అలియాస్‌ క్యాసినో ప్రవీణ్‌..ఇది పేరే కాదు ఇట్స్ ఏ బ్రాండ్

ప్రవీణ్ కస్టమర్ల లిస్టులో ఎంతోమంది రాజకీయ ప్రముఖులు ఉన్నారు.ప్రైవేట్ జెట్లలో కష్టమర్లను నేపాల్, గోవా,శ్రీలంక,మలేషియాల్లో ఉన్న క్యాసినో లకు తీసుకెళుతుంటాడు ప్రవీణ్. ఏపీ, తెలంగాణకు చెందిన మంత్రులు,ఎమ్మెల్యేలు, డీసీసీబీ చైర్మన్లు ప్రవీణ్ కష్టమర్లలో ఉన్నారు. తెలంగాణకు చెందిన ఓ మంత్రితో పాటు ఏపీకి చెందిన మాజీ మంత్రి కూడా ఉన్నారు.

 

 

ట్రెండింగ్ వార్తలు