Casino Chikoti Praveen : చికోటి ప్రవీణ్ తో వైసీపీ నేతలకు సంబంధాలు..నేపాల్ వెళ్లినవారిలో సగంమంది వారే

వైసీపీ నేతలకు కాసినో గాంబ్లర్ చిక్కోటి ప్రవీణ్ కు సంబంధాలు ఉన్నాయని..నేపాల్ కు వెళ్లిన సగం మంది వైసీపీ నేతలేనని టీడీపీ నేత వర్ల రామయ్య ఆరోపించారు.

Casino Chikoti Praveen : చికోటి ప్రవీణ్ తో వైసీపీ నేతలకు సంబంధాలు..నేపాల్ వెళ్లినవారిలో సగంమంది వారే

Casino Chikoti Praveen Ycp Leaders

Casino Chikoti Praveen-YCP Leaders : చికోటి ప్రవీణ్‌..అలియాస్‌ క్యాసినో ప్రవీణ్‌..ఇది పేరే కాదు ఇట్స్ ఏ బ్రాండ్ అన్నట్లుగా ఉంది చికోటీ ప్రవీణ్ లైఫ్ స్టైల్. ప్రముఖులే ప్రవీణ్ కష్టమర్లు. ముఖ్యంగా ఏపి, తెలంగాణలకు చెందిన ఎంతోమంది రాజకీయ ప్రముఖులు ప్రవీణ్ కు కష్టమర్లుగా ఉన్నారు. ఇదిలా ఉంటే వైసీపీ నేతలకు కాసినో గాంబ్లర్ చిక్కోటి ప్రవీణ్ కు సంబంధాలు ఉన్నాయని..నేపాల్ కు వెళ్లిన సగం మంది వైసీపీ నేతలేనని టీడీపీ నేత వర్ల రామయ్య ఆరోపించారు. మాజీ మంత్రి కొడాలి నాని..వల్లభనేని వంశీ ఆధ్వర్యంలోనే చిక్కోటి ప్రవీణ్ గుడివాడలో కేసినో నిర్వహించారని అన్నారు. కొడాలి నాని, వల్లభనేని వంశీల ఇళ్లల్లో ఈడీ సోదాలు చేస్తే అసలు విషయం బయటపడుతుందని అన్నారు. కేసినో ద్వారా వచ్చిన డబ్బుతో కొడాలి,వల్లభనేని ఏం వ్యాపారాలు చేశారు అనే విషయాన్ని త్వరలో బయటపెడతాను అంటూ హెచ్చరించారు టీడీపీ నేత వర్ల రామయ్య. చీకోటి ప్ర‌వీణ్ క‌స్ట‌మ‌ర్ల జాబితాలో తెలంగాణకు చెందిన ఓ మంత్రి, ఏపికి చెందిన ఓ మాజీ మంత్రి, 16 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లుగా తెలుస్తోంది.

Also read : asino Chikoti Praveen : చికోటి ప్రవీణ్‌..అలియాస్‌ క్యాసినో ప్రవీణ్‌..ఇది పేరే కాదు ఇట్స్ ఏ బ్రాండ్

క్యాసినోలు నిర్వ‌హిస్తూ హ‌వాలా లావాదేవీల‌కు పాల్ప‌డుతున్నార‌న్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న చీకోటి ప్ర‌వీణ్ ఇళ్లు, కార్యాల‌యాలు, ఫామ్ హౌజ్‌ల‌పై ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) అధికారులు దాడులు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ దాడుల్లో ఈడీ అధికారులు ప‌లు కీల‌క విష‌యాల‌ను సేక‌రించారు. ప్ర‌వీణ్ న‌డిపిన హ‌వాలా రాకెట్ల‌తో పాటు అత‌డు నిర్వ‌హించే క్యాసినోల‌కు రెగ్యుల‌ర్‌గా హాజ‌ర‌య్యే 200 మంది క‌స్ట‌మ‌ర్ల జాబితా కూడా బ‌య‌ట‌ప‌డినట్లుగా సమాచారం. ఈ లిస్టులో ప‌లువురు బిగ్ షాట్ల‌తో పాటు ప్రజా ప్ర‌తినిధులు కూడా ఉన్న‌ట్లుగా ఈడీ అధికారులు గుర్తించార‌ని స‌మాచారం.

చీకోటి ప్ర‌వీణ్ క్యాసినోల‌కు రెగ్యుల‌ర్‌గా హాజ‌ర‌య్యే వారి జాబితాలో ఏకంగా 18 మంది దాకా ప్ర‌జా ప్రతినిధుల్లో తెలంగాణ‌కు చెందిన ఓ మంత్రి, ఏపీకి చెందిన మాజీ మంత్రి ఉన్నారు. ఇక మిగిలిన 16 మంది రెండు రాష్ట్రాల‌కు చెందిన ఎమ్మెల్యేలు. నేపాల్‌, ఇండోనేషియా, శ్రీలంక‌ల‌కు వీరంద‌రి‌నీ తీసుకెళ్లే ప్ర‌వీణ్ వారి కోసం అక్క‌డ క్యాసినోలు ఏర్పాటు చేసేవాడు. క‌స్ట‌మ‌ర్ల‌ను త‌ర‌లించేందుకు ఒక్కో విమానానికి రూ.50 ల‌క్ష‌లు చెల్లించే ప్ర‌వీణ్‌… ఆయా దేశాల్లో ల‌గ్జ‌రీ హోట‌ళ్ల‌లో విడిది కోసం రూ.40 ల‌క్ష‌ల దాకా ఖర్చు చేసేవాడు. ఇందుకోసం ప్ర‌తి టూర్‌కు ఎంట్రీ ఫీజుగా ఒక్కొక్క‌రి వ‌ద్ద చిక్కోటి ప్రవీణ్ రూ.5 ల‌క్ష‌లు వ‌సూలు చేసేవాడు.

Also read : Casino Chikoti praveen : క్యాసినో చికోటి ప్రవీణ్‌ కేసు..మాధవరెడ్డి కారుపై మంత్రి మల్లారెడ్డి స్టిక్కర్..!

ప్ర‌వీణ్‌పై సోదాల సంద‌ర్భంగా హ‌వాలా కోణాన్ని ఈడీ అధికారులు గుర్తించారు. హైద‌రాబాద్‌కు చెందిన న‌లుగురు ప్ర‌ముఖ వ్యాపారుల‌తో నిత్యం ట‌చ్‌లో ఉంటూ ప్ర‌వీణ్ హ‌వాలాకు పాల్ప‌డ్డాడు. దీంతో అత‌డు హ‌లావా వ్యాపారం న‌డిపించిన న‌లుగురిపై ఈడీ అధికారులు దృష్టి సారించారు. ఇక క్యాసినోల నిర్వహ‌ణ‌లో భాగంగా భార‌త క‌రెన్సీ కంటే కూడా ఇత‌ర దేశాల క‌రెన్సీనే తీసుకునేవాడట. ఈ క్ర‌మంలోనే అత‌డు హ‌వాలాకు పాల్ప‌డ్డాడ‌ని ఈడీ అధికారులు నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు.