Hyderabad: భారీ వర్షాలు కురిసే అవకాశం.. అప్రమత్తంగా ఉండండి.. నగర వాసులకు అధికారుల సూచన

నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలపడంతో నగర వాసులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతేనే బయటకు రావాలని జీహెచ్ఎంసీ తెలిపింది. ఏమైనా ఇబ్బందులు ఎదురైన పక్షంలో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సహాయ కేంద్ర నెంబర్ 040-21111111 కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు.

Rain In Hyderabad

Hyderabad: వర్షకాలం ప్రారంభమైంది. మరో రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నారు. దీంతో రెండు రాష్ట్రాల్లోని పలుప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. రాత్రి సమయంలో ఎడతెరిపి లేకుండా గంటపాటు వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. వర్షం నీటితో నాళాలన్నీ పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. నగర వాసులకు వర్షాల వల్ల ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి కేంద్రీకరించారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నగర మేయర్ గద్వాల విజయలక్ష్మీ ఇప్పటికే సూచించారు.

Hyderabad Rains : హైదరాబాద్‌లో వర్షం.. తడిసి ముద్దయిన నగరం

నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలపడంతో నగర వాసులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతేనే బయటకు రావాలని జీహెచ్ఎంసీ తెలిపింది. ఏమైనా ఇబ్బందులు ఎదురైన పక్షంలో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సహాయ కేంద్ర నెంబర్ 040-21111111 కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు. సోమవారం రాత్రి కురిసన వర్షంతో పలు ప్రాంతాల్లో రోడ్లపైకి వర్షపు నీరు చేరడంతో ప్రయాణీకులు ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా మ్యాన్ హోల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.

Google Co-Founder: బిల్‌గెట్స్, జెఫ్ బెజోస్ బాటలో సెర్జీబ్రిన్ దంపతులు.. ఏం చేస్తున్నారంటే..

ఇదిలాఉంటే సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా మాదాపూర్ లో 10.2 సెం.మీ వర్షపాతం నమోదైంది. బాలానగర్ లో 7.6 సెం.మీ, మూసాపేట్ 6.8, షాపూర్ నగర్ 6.6 సెం.మీ వర్షపాతం నమోదైంది. మరో వారం రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సమస్య ఎదురైతే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు.