Road Accident : హైదరాబాద్ ఎల్బీ నగర్ లో విషాదం నెలకొంది. కారు డ్రైవర్ నిర్లక్ష్యానికి రెండేళ్ల చిన్నారి బలి అయింది. రోడ్డు ప్రమాదంలో చిన్నారి మృతి చెందారు. వివరాళ్లోకే వెళ్తే.. మన్సూరాబాద్ – ఎల్బీ నగర్ మార్గంలో రోడ్డుపై కారు ఆపిన డ్రైవర్.. అకస్మాత్తుగా కారు డోర్ తీశాడు. అదే సమయంలో అటుగా వస్తున్న బైక్ కు కార్ డోర్ తగిలింది.
దీంతో బైక్ పై వెళ్తోన్న దంపతులు సహా రేండేళ్ల చిన్నారి కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన చిన్నారి ధనలక్ష్మి అక్కడికక్కడే మృతి చెందారు. చిన్నారి తల్లిదండ్రులకు స్పల్ప గాయాలు అయ్యాయి.
Jammu Bus Accident: జమ్మూకాశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. బ్రిడ్జిపై నుంచి బస్సు బోల్తా
క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. వారికి డాక్టర్లు వైద్యం అందిస్తున్నారు. కాగా, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.