Clash : ఖమ్మం జిల్లాలో కర్రలు, గడ్డపారలతో ఇరు వర్గాలు పరస్పర దాడి.. ఏడుగురికి తీవ్ర గాయాలు

మూడు నెలలుగా సోషల్ మీడియాలో ఒకరిపైమరొకరు దుష్ప్రచారం చేసుకుంటున్నారు. గ్రామంలోని గుడి వద్ద నిర్మిస్తున్న గోడ విషయంలో ఘర్షణ జరిగిది.

Clash : ఖమ్మం జిల్లాలో కర్రలు, గడ్డపారలతో ఇరు వర్గాలు పరస్పర దాడి.. ఏడుగురికి తీవ్ర గాయాలు

Clash between Two groups

Updated On : September 24, 2023 / 3:36 PM IST

Clash seven seriously injured : ఖమ్మం జిల్లా బోనకల్ మండలం గోవిందాపురం గ్రామంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. సమస్యాత్మక గ్రామమైన గోవిందాపురంలో పాత కక్షలు నివురు గప్పిన నిప్పులా ఉన్నాయి. కర్రలు, గడ్డపారలతో ఇరు వర్గాలు పరస్పరం దాడి చేసుకున్నాయి. రాజకీయ కక్షల నేపథ్యంలో ఒకరిపై ఒకరు దాడి ఏడుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి.

మూడు నెలలుగా సోషల్ మీడియాలో ఒకరిపైమరొకరు దుష్ప్రచారం చేసుకుంటున్నారు. గ్రామంలోని గుడి వద్ద నిర్మిస్తున్న గోడ విషయంలో ఘర్షణ జరిగిది. ఇది చిలికి చిలికి గాలివానగా మారి ఒకరిపైమరొకరు దాడి చేసుకునే వరకు పోవడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.

Manipur: మణిపూర్‌లో మళ్లీ హింస.. పోలీసులతో ఆందోళనకారుల ఘర్షణ

పోలీసుల పహారా మధ్య గోవిందాపురం ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు బిక్కు బిక్కు మంటున్నారు. గాయపడిన వారిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు.