World Environment Day: ప్రభుత్వ పాఠశాలలు, కూరగాయల మార్కెట్ వద్ద స్వచ్ఛతా కార్యక్రమాలు

కమ్యూనిటీని నిమగ్నం చేయడానికి, అవగాహన కల్పించడానికి, వెల్‌స్పన్ ప్రపంచ పర్యావరణ దినోత్సవం నేపథ్యం చుట్టూ ఒక క్విజ్ పోటీని నిర్వహించింది. ఈ పోటీ పాల్గొనేవారికి పర్యావరణ సమస్యలపై వారి జ్ఞానాన్ని, అవగాహనను ప్రదర్శించడానికి వేదికగా ఉపయోగపడింది

World Environment Day: ప్రభుత్వ పాఠశాలలు, కూరగాయల మార్కెట్ వద్ద స్వచ్ఛతా కార్యక్రమాలు

Cleanliness programs at government schools and vegetable markets on the occasion of World Environment Day

Updated On : June 14, 2023 / 11:04 PM IST

World Environment Day: ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2023ను పురస్కరించుకుని గ్రామీణ నేపధ్యంలో నిర్వహించిన అనేక పర్యావరణ అనుకూల కార్యక్రమాలు, కమ్యూనిటీ ఈవెంట్‌లు జరిగాయి. ఇందులో భాగంగా వెల్‌స్పన్ ఇండియా #BeatPlasticPollution అనే పేరుతో పర్యావరణ నిర్వహణ పట్ల తన నిబద్ధతను పునరుద్ఘాటించింది. స్థిరమైన పద్ధతుల పట్ల తన అంకితభావాన్ని ప్రదర్శించింది.

Revanth Reddy : ధరణి పేరుతో భారీ దోపిడీ, తెలంగాణ భూములన్నీ ఆంధ్రా శ్రీధర్ రాజుకు కట్టబెట్టారు- రేవంత్ రెడ్డి

ఈ ఉత్సవాల్లో భాగంగా, స్థానిక సమాజం, పర్యావరణంపై సానుకూల ప్రభావాన్ని చూపే అనేక రకాల కార్యకలాపాలను వెల్‌స్పన్ నిర్వహించింది. ప్రభుత్వ పాఠశాలలు, కూరగాయల మార్కెట్‌ల వంటి ప్రాంతాలలో పెద్ద ఎత్తున స్వచ్ఛత కార్యక్రమాలను నిర్వహించింది. ఈ కార్యక్రమాలలో 100 మందికి పైగా ఉత్సాహంగా పాల్గొనటంతో పాటుగా గంటపాటు “గ్రీనాథన్”లో పాల్గొన్నారు. ఈ స్వచ్చత ప్రయత్నాలు పరిశుభ్రతను ప్రోత్సహించడం, వ్యర్థాల నిర్వహణ యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నాయి.

Infinix Note 30 5G Launch : ఇన్ఫినిక్స్ నోట్ 30 5G ఫోన్ వచ్చేసింది.. దిమ్మతిరిగే ఫీచర్లు.. రూ. 14,999కే సొంతం చేసుకోవచ్చు..!

ఈ స్వచ్ఛత కార్యక్రమాలతో పాటు, ఉద్యానవన శాఖ సహకారంతో వెల్‌స్పన్ మొక్కలు నాటే కార్యక్రమం కూడా నిర్వహించింది. సంస్థ ఆవరణలో పెద్దసంఖ్యలో మొక్కలు నాటారు. ఇది మొత్తం మీద హరితం పెంచటంతో పాటుగా పర్యావరణ వ్యవస్థకు దోహదపడింది. వెల్‌స్పన్ పర్యావరణంపై దాని ప్రభావాన్ని తగ్గించడానికి, స్థానిక పర్యావరణ వ్యవస్థకు మద్దతు ఇవ్వడానికి చురుకుగా ప్రయత్నిస్తున్నందున, ఈ కార్యక్రమం జీవవైవిధ్య పరిరక్షణకు సంస్థ నిబద్ధతకు అనుగుణంగా ఉంది.

Samsung: అతిపెద్ద ప్రీమియం ఎక్స్‌పీరియన్స్ స్టోర్‌ను హైదరాబాద్‌లోని ఇనార్బిట్ మాల్‌లో ప్రారంభించిన శాంసంగ్

కమ్యూనిటీని నిమగ్నం చేయడానికి, అవగాహన కల్పించడానికి, వెల్‌స్పన్ ప్రపంచ పర్యావరణ దినోత్సవం నేపథ్యం చుట్టూ ఒక క్విజ్ పోటీని నిర్వహించింది. ఈ పోటీ పాల్గొనేవారికి పర్యావరణ సమస్యలపై వారి జ్ఞానాన్ని, అవగాహనను ప్రదర్శించడానికి వేదికగా ఉపయోగపడింది, హాజరైనవారిలో అవగాహన, బాధ్యత భావాన్ని పెంపొందించింది.