CM KCR: ఆనాటి పరిస్థితులు గుర్తొస్తే భయమేస్తుంది -కేసీఆర్
సమైక్య పాలనలో నీటి సమస్యతో తెలంగాణ ఇబ్బంది పడిందని సీఎం కేసీఆర్ అన్నారు. ఆ రోజుల్లో బావులను, బోర్లను అద్దెకు తీసుకుని ట్యాంకర్లతో నీటిని అందించినట్లు గుర్తుచేశారు.

Kcr (4)
CM KCR: సమైక్య పాలనలో నీటి సమస్యతో తెలంగాణ ఇబ్బంది పడిందని సీఎం కేసీఆర్ అన్నారు. ఆ రోజుల్లో బావులను, బోర్లను అద్దెకు తీసుకుని ట్యాంకర్లతో నీటిని అందించినట్లు గుర్తుచేశారు. ఆనాటి పరిస్థితులను గుర్తు చేసుకుంటే ఇప్పటికీ భయం వేస్తుందని అన్నారు. ప్రస్తుతం చెరువులన్నీ నిండాయని, ఇటువంటి అభివృద్ధినే తెలంగాణ కోరుకుందని వెల్లడించారు.
మే నెలలో కూడా చెరువులు పారుతున్నాయని, హల్దీ, కూడవెళ్లి వాగులు ఏప్రిల్, మే నెలల్లోనూ పొంగిపొర్లాయని అన్నారు. వీటి కోసమే తెలంగాణ సాధించుకున్నామని, అందుకు ఎంతో గర్వంగా ఉందని అన్నారు కేసీఆర్. పాలనా సంస్కరణల్లో భాగంగా రాష్ట్రంలో 33 జిల్లాలు ఏర్పాటు చేసినట్లు తెలిపిన ముఖ్యమంత్రి.. తెలంగాణలో ఈ ఏడాది 3కోట్ల టన్నుల వరి ధాన్యం పండిందని అన్నారు.
వైద్యంలోనూ రాష్ట్రం మెరుగుపడిందని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రస్తుతం 56శాతం ప్రసవాలు జరుగుతున్నట్లు చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో వెయ్యి గురుకుల పాఠశాలలు, కళాశాలలు ఉన్నట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో పత్తి ఎంతో నాణ్యమైనదని, రాష్ట్రంలో ఎంత పత్తి పండినా అమ్మడుపోతుందని అన్నారు. తెలంగాణలో 400 జిన్నింగ్ మిల్లులు ఉన్నట్లు చెప్పారు.