KA Paul : కొండగట్టుకు కేసీఆర్ కేటాయించిన కోట్ల రూపాయలు వాళ్ళ అబ్బ సొమ్ములా : కేఏ పాల్

కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్న సీఎం కేసీఆర్ కొండగట్టు అభివృద్ధికి రూ.600 కోట్లు కేటాయించారు. ఇప్పటికే రూ.100 కోట్లు కేటాయించిన కేసీఆర్ తాజాగా అంజన్నను దర్శించుకున్న తరువాత మరో రూ.600లు కేటాయించటంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఏ పాల్ ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్ కొండగట్టుకు కేయటాయించి రూ.600కోట్లు వాళ్ల అబ్బా సొమ్ములా? అంటూ ప్రశ్నించారు.

KA Paul : కొండగట్టుకు కేసీఆర్ కేటాయించిన కోట్ల రూపాయలు వాళ్ళ అబ్బ సొమ్ములా : కేఏ పాల్

KA Paul criticized CM KCR

Updated On : February 16, 2023 / 1:41 PM IST

KA Paul : కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్న సీఎం కేసీఆర్ కొండగట్టు అభివృద్ధికి రూ.600 కోట్లు కేటాయించారు. ఇప్పటికే  రూ.100 కోట్లు కేటాయించిన కేసీఆర్ తాజాగా అంజన్నను దర్శించుకున్న తరువాత మరో రూ.600లు కేటాయించటంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఏ పాల్ ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్ కొండగట్టుకు కేయటాయించి రూ.600కోట్లు వాళ్ల అబ్బా సొమ్ములా? అంటూ ప్రశ్నించారు. తెలంగాణ అప్పుల కుప్పగా మారిందని కేంద్ర ప్రభుత్వమే చెప్పిందని గుర్తు చేసిన కేఏ పాల్ రాష్ట్ర ప్రభుత్వం వద్ద డబ్బు లేదని భూములు అమ్ముతున్నారని అటువంటి సమయంలో దేవాలయానికి కోట్ల రూపాయలు కేటాయిస్తు డబ్బుని దుబారాగా ఖర్చు చేస్తున్నారంటూ ఆరోపించారు.

కొండగట్టుకు సీఎం కేసీఆర్ చేసిన భారీగా నిధుల కేటాయింపుపై హైకోర్టులో కేసు వేస్తానని తెలిపారు. హిందుత్వ అజెండాతో ఆర్ఎస్ఎస్ పనిచేస్తుందని అటువంటి ఆర్ఎస్ఎస్ ఇస్తున్న ఆదేశాలతోనే కేసీఆర్ పనిచేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు పాల్. ఆర్ఎస్ఎస్ అండ కేసీఆర్,కేటీఆర్ కు ఉంది కాబట్టే లిక్కర్ కేసులో ఇరుక్కున్న కవితన అరెస్ట్ చేయటంలేదంటూ ఆరోపించారు. లిక్కర్ కేసులో కవిత అరెస్ట్ కాకుండా ఉండటానికే..కేసీఆర్, కేటీఆర్ లు ఆర్ఎస్ఎస్ ఆదేశాలను పాటిస్తున్నారని ఆరోపించారు. తొమ్మిదేళ్ల తమ పాలనా వైఫల్యాలు కప్పి పుచ్చుకోవడానికే కేసీఆర్ ప్రయాసపడుతున్నారని విమర్శించి పాల్. కేసీఆర్ బీజేపీకి ‘బి’ అంటూ ఆరోపించిన పాల్ బీజేపీకి మద్దతు ఇస్తోందని ఆరోపించారు.

తెలంగాణలో 38 వేల చర్చిలు ఉన్నాయి..వాటిలో వేటినైనా కేసీఆర్ అభివృద్ధి చేశారా? నిధులేమైనా కేటాయించారా? అంటూ ప్రశ్నించారు. కానీ ఎన్నికల్లో లబ్ది పొందటానికే ఇప్పటి వరకు లేదని ఇప్పుడే కొండగట్టకు భారీగా నిధులు కేటాయించారని..డబ్బు లేనప్పుడు ప్రజాధనం దుర్వినియోగం చేసి గుడులు కట్టడం ఏంటి? అంటూ ప్రశ్నించారు.
యాదగిరి గుట్ట నిర్మాణంలో 200 కోట్ల అవినీతి జరిగిందనీ..దీనిపై దర్యాప్తు జరపాలి అంటూ డిమాండ్ చేశారు పాల్.

ఇలా కేసీఆర్ పై పలు రకాలుగా ఆరోపణలు చేసిన పాల్ తెలంగాణ నూతన సచివాలయానికి తనను ఆహ్వానించలేదంటూ మండిపడ్డారు. నూతన సచివాలయం ప్రారంభానికి తమిళనాడు సీఎం స్టాలిన్ ని పిలిచారట..కానీ నన్ను మాత్రం పిలవలేదంటూ విమర్శించారు. అలాగే కేసీఆర్ కు ముందుగానే జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ..ప్రజా ధనాన్ని ఇలా దేవాలయాలకు కేటాయిస్తూ దుర్వినియోగం చేయవద్దని సూచించారు. కేసీఆర్ కొండగట్టుకు ఎవరి డబ్బు ఇస్తున్నారు..ఈ నిధుల కేటాయింపుకు సంబంధించి అసెంబ్లీలో పాస్ అవ్వాలని అన్నారు.ముఖ్యమంత్రి అయినంత మాత్రాన ఇలా ఇష్టానుసారంగా కోట్ల రూపాయలు ఇష్టమొచ్చినవాటికి కేటాయించే అధికారం లేదన్నారు. ‘నేను హిందువుని.. నేను హిందుగానే చస్తా..నేను టెంపుల్,చర్చి,మసీదుకు వెళ్ళను నా మనసే నా గుడి’ అంటూ చెప్పుకొచ్చిన కేఏ పాల్ కొండగట్టుకు కేసీఆర్ కేటాయించిన భారీ నిధులు విషయంపై కోర్టులో తేల్చుకుంటానని తెలిపారు.