Experium Eco Friendly Park : తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకృతి వనంగా మారుస్తాం- ఎక్స్‌పీరియం పార్క్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

టూరిస్ట్ పాల‌సీ తీసుకొచ్చి ఎకో టూరిజాన్ని ప్రోత్సహిస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 150 ఎకరాల్లో ఒక అద్భుతం సృష్టించారు రాందేవ్ రావ్ అని పొగిడారు.

Experium Eco Friendly Park : మంచి ఎకో టూరిజం పార్క్ ప్రారంభించడం సంతోషదాయకం అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఐటీ, ఫార్మా, నిర్మాణ రంగాలలో రాణించిందని తెలిపారు. టూరిజం.. రాష్ట్రానికి ఆదాయమే కాకుండా గుర్తింపును కూడా పెంచుతుందన్నారు.

మందిరాల దర్శన కోసం, ప్రకృతి అందాలను చూసేందుకు మనం ఇతర రాష్ట్రాలకు వెళుతున్నామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హెల్త్, ఎకో, టెంపుల్ టూరిజంపై ఫోకస్ చేయాల్సి ఉందని చెప్పారాయన. అన్ని స‌హ‌జ వ‌న‌రులున్న తెలంగాణ‌పై గ‌త ప్ర‌భుత్వాలు దృష్టి సారించ‌లేదని విమర్శించారు. రేవంత్ రెడ్డి.

”150 ఎకరాల్లో ఎక్స్ పీరియస్ పార్క్ ను ఏర్పాటు చేశారు. ఎక్స్ పీరియం పార్క్ ను తీర్చిదిద్దిన రామ్ దేవ్ కు అభినందనలు. తెలంగాణకు కావాల్సింది టెంపుల్ టూరిజం, హెల్త్ అండ్ ఎకో టూరిజం. టెంపుల్ టూరిజం మరింత అభివృద్ధి చెందాలి. ఎక్స్ పీరియం పార్క్ తో రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. త్వరలో టూరిజం పాలసీని అమలు చేస్తాం” అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

Also Read : జగిత్యాల జిల్లాలో భూ కుంభకోణం..! ఎరక్కపోయి ఇరుక్కుపోయిందెవరు? చివరికి బుక్కయ్యేదెవరు?

రాందేవ్.. 150 ఎకరాల్లో ఒక అద్భుతం సృష్టించారు..
ఎకో టూరిజం పాలసీపై ఈ మధ్య అసెంబ్లీలో చర్చించామన్నారు. టూరిస్ట్ పాల‌సీ తీసుకొచ్చి ఎకో టూరిజాన్ని ప్రోత్సహిస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 150 ఎకరాల్లో ఒక అద్భుతం సృష్టించారు రాందేవ్ రావ్ అని పొగిడారు. మరొక ఎడారిలో ఎక్స్ పీరియం అద్భుతమైన పర్యాటక కేంద్రంగా మారుతుందన్నారు. వికారాబాద్ ప్రాంతాన్ని ఎకో టూరిజంలో అభివృద్ధి చేస్తామన్నారు.

తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకృతి వనంగా మారుస్తాం..
తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకృతి వనంగా మార్చాలని ప్లాన్ చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రామయ్య మొక్కలు నాటినందుకు పద్మశ్రీ అవార్డు రావడం సంతోషదాయకం అన్నారు. ప్రతి విద్యార్థి తమ తల్లి పేరు మీద ఒక మొక్కను నాటి దాన్ని కాపాడాలి అనే కార్యక్రమాన్ని చేపట్టబోతున్నామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.

Also Read : మహిళా సంఘాలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. మీ డబ్బులు వాపస్ ఇస్తున్న ప్రభుత్వం

150 ఎక‌రాల్లో పార్క్‌ ఏర్పాటు..
రంగారెడ్డి జిల్లా పొద్దుటూరులో ఎక్స్‌పీరియం ఎకో ఫ్రెండ్లీ పార్క్‌ను ప్రారంభించారు ముఖ్యమంత్రి రేవంత్. ఈ కార్య‌క్ర‌మంలో మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు. ప్ర‌పంచ‌స్థాయి ప్ర‌మాణాల‌తో ఏకంగా 150 ఎక‌రాల్లో ఈ పార్క్‌ను ఏర్పాటు చేశారు. 85 దేశాల నుంచి దిగుమ‌తి చేసుకున్న 25 వేల జాతుల మొక్క‌లు, వృక్షాలు ఇందులో ఉన్నాయి. లక్ష రూపాయల నుంచి 3.5 కోట్ల రూపాయల విలువ చేసే అరుదైన వృక్షాల‌ను కూడా ఉంచారు.

150 కోట్ల రూపాయల విలువైన మొక్క‌లు, చెట్లు, వృక్షాలు క‌లిగిన ఏకైక ప‌ర్యాట‌క ప్రాంతం ఈ ఎక్స్‌పీరియం పార్క్‌. రాందేవ్‌రావ్ ఆరున్న‌రేళ్ల పాటు శ్ర‌మించి ఈ పార్క్‌ను ఏర్పాటు చేశారు. ఇక, 1500 మంది కూర్చునేలా యాంఫీ థియేట‌ర్‌ను సైతం ఈ పార్క్ లో రూపొందించారు.