Yadadri Thermal Power Plant : యాదాద్రి థర్మల్ ప్లాంట్ పైలాన్‌ను జాతికి అంకితం చేసిన సీఎం రేవంత్..

యాదాద్రి పవర్ ప్లాంట్ 4వేల మెగావాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేయగలదు.

Yadadri Thermal Power Plant : నల్గొండ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా దామరచర్ల మండలం వీర్లపాలెం దగ్గర యదాద్రి ధర్మల్ పవర్ ప్లాంట్ రెండో దశను ప్రారంభించారు. అనంతరం ధర్మల్ ప్లాంట్ పైలాన్ ను ఆవిష్కరించి జాతికి అంకితం చేశారు. యూనిట్ 2 ద్వారా విద్యుత్ ఉత్పత్తిని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి సీఎం రేవంత్ ప్రారంభించారు. ఆ తర్వాత యాదాద్రి ధర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణ పనులకు సంబంధించి ఫోటో ఎగ్జిబిషన్ ను తిలకించారు.

సీఎం రేవంత్ ప్రారంభించిన యాదాద్రి పవర్ ప్లాంట్ 4వేల మెగావాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేయగలదు. ఈ పవర్ ప్లాంట్ లో మొత్తం 5 యూనిట్లను నిర్మించారు. ఒక్కో యూనిట్ సామర్థ్యం 800 మెగావాట్లు. ఇక పవర్ ప్లాంట్ నిర్మాణానికి 4వేల 276 ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించింది. ప్రాజెక్ట్ మొత్తం అంచనా వ్యయం 30వేల కోట్లుగా ప్రభుత్వం నిర్ణయించింది. 2015లో ప్రాజెక్ట్ పనులకు శంకుస్థాపన చేయగా 2017లో పవర ప్లాంట్ పనులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ప్లాంట్ లో రెండు యూనిట్ల పనులు పూర్తయ్యాయి. 2025 చివరికి మిగిలిన పనులు పూర్తి చేసే అవకాశం ఉంది.

మొత్తం 5 యూనిట్లుగా పవర్ ప్లాంట్ నిర్మాణం కొనసాగుతోంది. రెండు యూనిట్లలో పనులు పూర్తయ్యాయి. సింక్రనైజేషన్ పనులు కూడా ప్రారంభించారు. వచ్చే ఏడాది జూలై నాటికి మిగిలిన మూడు యూనిట్లు పూర్తయ్యేలా పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద గత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ థర్మల్ పవర్ ప్లాంట్ ను చేపట్టింది.

* 4 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో పవర్ ప్లాంట్
* 5 యూనిట్లలో రెండు యూనిట్లు పూర్తి చేసిన జెన్ కో
* 2025 మే నాటికి మిగిలిన మూడు యూనిట్ల పనులు పూర్తి
* 2015లో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ కు శంకుస్థాపన
* నాడు ప్రాజెక్ట్ అంచనా వ్యయం రూ.29వేల 500 కోట్లు
* ప్రస్తుతం 50వేల కోట్లకు పెంచిన ప్రభుత్వం
* బొగ్గు సరఫరా కోసం రూ.400 కోట్లతో రైల్వే లైన్
* విష్ణుపురం నుంచి పవర్ ప్లాంట్ కి 8 కిమీ రైల్వే ట్రాక్
* 4వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ఏటా 3.5 టీఎంసీల నీరు
* 2028-2029 నాటికి ముగుస్తున్న 10వేల మెగావాట్ల విద్యుత్ ఒప్పందం
* తెలంగాణ రాష్ట్రానికి కీలకం కానున్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్

Also Read : మహబూబ్ నగర్‌లో భూప్రకంపనలు.. భయాందోళనలో ప్రజలు