Earthquake : మహబూబ్ నగర్‌లో భూప్రకంపనలు.. భయాందోళనలో ప్రజలు
ఎప్పుడేం జరుగుతుందోనని కంగారు పడుతున్నారు.

Earthquake : మహబూబ్ నగర్ జిల్లాలో భూప్రకంపనలు కలకలం రేపాయి. పలు ప్రాంతాల్లో స్వల్ప భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. కౌకుంట్ల మండలం దాసరిపల్లి సమీపంలో భూకంప కేంద్రాన్ని అధికారులు గుర్తించారు. రిక్టర్ స్కేల్ పై 3.0 తీవ్రతగా నమోదైంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కౌకుంట్ల మండలం దాసరిపల్లి సమీపంలో భూకంప కేంద్రం నమోదైంది. స్వల భూప్రకంపనలతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల భూప్రకంపనలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఎప్పుడేం జరుగుతుందోనని కంగారు పడుతున్నారు. తాజాగా మహబూబ్ నగర్ జిల్లాలో భూమి స్వల్పంగా కంపించడం కలకలం రేపిందని చెప్పాలి. కొన్ని రోజుల వ్యవధిలోనే మరోసారి భూమి కంపించడం ఆందోళనకు గురి చేసింది. మరోసారి భూమి కంపించే అవకాశం ఉందేమోనని భయపడుతున్నారు.
ఇవాళ 12 గంటల 15 నిమిషాలకు భూమి కంపించిందని స్థానికులు తెలిపారు. అసలేం జరిగిందో అర్థం కాలేదన్నారు. భూమి కంపించడంతో భయపడిపోయామన్నారు. ఇంట్లోని వస్తువులు అటు ఇటు కదలడంతో కంగారుపడ్డామని తెలిపారు. కాగా, రాష్ట్రంలో భూమి కంపించడం వారం రోజుల వ్యవధిలో ఇది రెండోసారి అని అధికారులు తెలిపారు.
డిసెంబర్ 4న తెలంగాణలో భూకంపం వచ్చింది. ములుగు జిల్లాలో 5.3 తీవ్రతతో భూమి కంపించింది. అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోనూ స్వల్పంగా భూమి కంపించింది. అయితే, ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరక్కపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
భారత్ ను నాలుగు సీస్ మిక్ డివిజన్లుగా వర్గీకరించారు. భూకంప తీవ్రతను బట్టి జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4, జోన్ 5 గా డివైడ్ చేశారు. తెలంగాణ ప్రాంతం జోన్ 2లో ఉంది. ఇక్కడ స్వల్ప ప్రకంపనలు వచ్చే అవకాశం మాత్రమే ఉంది. అయితే, ఇందుకు పూర్తి భిన్నంగా గుజరాత్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, నార్త్ ఈస్ట్రన్ రాష్ట్రాలు జోన్ 5 లో ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో భూకంపాల రిస్క్ ఎక్కువగా. తరుచుగా భూమి కంపిస్తూ ఉంటుంది. ఈ ప్రాంతాల్లో తీవ్రమైన భూకంపాలు వచ్చే అవకాశాలు ఎక్కువ.
Also Read : భూకంపం ఎందుకు వచ్చింది? తెలుగు రాష్ట్రాలు ప్రమాదంలో ఉన్నాయా?